ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువుతీరిన కూటమి ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ల పంపిణీ విషయంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారికి కొత్తగా పెన్షన్లను అందించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. గత జూన్ నెలలో అధికారం చేపట్టిన తర్వాత జూలై 1 తారీఖున ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు వేల రూపాయల పెన్షన్ తో పాటు ఏప్రిల్, మే ,మరియు జూన్ నెలలో ప్రతినెల 1000 రూపాయలు చొప్పున మూడు నెలల కాలానికి మూడు వేల రూపాయలు కలిపి మొత్తంగా 7వేల రూపాయల పెన్షన్ జూలై ఒకటో తారీఖున లబ్ధిదారులకు అందించడం జరిగింది.
ఇదే సమయంలో గత ప్రభుత్వంలోని రాజకీయ నాయకుల ప్రోద్బలంతో చాల మంది అనర్హులు తప్పుడు పత్రాలను చూపించి పెన్షన్లు పొందుతున్నట్టుగా నిర్ధారించారు . అలాంటి వారిని గుర్తించి వారి పెన్షన్లను రద్దు చేయనున్నట్లు కూటమి ప్రభుత్వం తెలిపింది దీని ఫలితంగా దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది తమ పెన్షన్ లను కోల్పోనున్నారు.
అలాగే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క కొత్త పెన్షన్ స్వీకరించలేదు అయితే ఇప్పటి కూటమి ప్రభుత్వం అనార్హులను తొలగించి కొత్తవారికి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 67 లక్షల మంది పైగా పెన్షన్ పొందుతున్నారు తాజాగా అర్హులైన వారికి కొత్తగా పెంచలనం అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ నెల మొదటివారం నుంచి దరఖాస్తులను స్వీకరించాలని భావిస్తోంది కాబట్టి వచ్చేవారం గ్రామ లేదా వార్డు సచివాలయాలలో ఈ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని సమాచారం
Leave a Comment