తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జాబ్ కాలెండర్ ప్రకారం అక్టోబర్ నెలలో విద్యుత్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉండగా ఈ మేరకు విద్యుత్ సంస్థలలో ఉద్యోగాల వివరాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్లు తెలుస్తోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 విద్యుత్ సంస్థలలో సుమారు మూడు వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.
మరో రెండు నెలలలో యాదాద్రి విద్యుత్ కేంద్రం ఉత్పత్తి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇందులో అవసరమైన సహాయ డివిజినల్ ఇంజనీర్, పర్యవేక్షక ఇంజనీరు, తదితర ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నట్లు సమాచారం. కాబట్టి త్వరలోనే తెలంగాణాలో ఉన్న విద్యుత్ సంస్థలలో సుమారు మూడు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇలాంటి లేటెస్ట్ ఉద్యోగ సమాచారం కోసం మా టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ లేదా మా వాట్సాప్ ఛానల్ గ్రూప్ లో కానీ జాయిన్ అవండి.
Leave a Comment