ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక నిరుత్సహ పడుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ అబ్యర్ధుల కోసం అనేక రకాల పథకాలను ప్రవేశ పెట్టింది. అందులో ముఖ్యమైనది ప్రధాన మంత్రి విశ్వ కర్మ యోజన.
చదువుకుని ఉద్యోగం రాక ఏదైనా స్వయం ఉపాధి ద్వారా ఉపాధి పొందాలి అని ఆలోచిస్తున్న నిరుద్యోగులకు ప్రధాన మంత్రి విశ్వ కర్మ యోజన పథకం నిజంగా ఒక వరం అని చెప్పవచ్చు.
చేతి వృత్తులను ప్రోత్సహిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా 18 రకాల చేతి వృత్తుల వారికి కులంతో సంబంధం లేకుండా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కేవలం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ ఉంటె చాలు. మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా చేపలు పట్టేవారు, రజకులు, దర్జీలు, బొమ్మల తయారీ దారులు, వడ్రంగి పని చేసేవారు ఇలా మొత్తం 18 రకాల చేతి వృత్తుల వారికీ ప్రయోజనం కలుగుతుంది.
ఎంపికయిన అభ్యర్థులకు ఏడు రోజుల శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో రోజుకు 500 రూపాయలు ఇస్తారు తరువాత 15 వేల రూపాయల విలువగల టూల్ కిట్ ఉచితంగా అందిస్తారు. మొదట విడత లక్ష రూపాయలు రెండవ విడత రెండు లక్షల ఋణం ఇస్తారు ఈ రుణానికి సంవత్సరానికి 5% మాత్రమే వడ్డీ ఉంటుంది.
ఈ పథకం నమోదు కోసం మీ సమీపంలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయం నందు సంప్రదించండి. ఇంత తక్కువ వడ్డీకి ఋణం పొంది నిరుద్యోగులు తమ కాళ్ళపైన తాము నిలబడగలరు.
Leave a Comment