నిరుద్యోగులకు శుభవార్త హైదరాబాదులో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 30 మే 2024న DLOMI, DRDO Township, Kanchanbagh, హైదరాబాద్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి అధునాతన సిస్టం లేబరేటరీలలో పని చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మూడు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఇందులో జూనియర్ రీసెర్చ్ ఫెలో రెండు పోస్టులు కాగా రీసెర్చ్ అసోసియేట్ ఒక పోస్టు ఉన్నాయి
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు పరిమితి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల వారికి వయస్సు పరిమితిలో సడలింపు ఉంటుంది అంటే బీసీ కేటగిరి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వరకు మినహాయింపు అనేది ఉంటుంది ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు అనేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక ఉంటుంది అలాగే ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగంలో చేరగాని జూనియర్ రీసెర్చ్ పిల్లలకు నెలకు 37వేల రూపాయల Stifend అలాగే జూనియర్ అసోసియేట్ కి నెలకు 67000 పాటు రెసిడెన్షియల్ కల్పించబడుతుంది ఒకవేళ వసతి లేనిపక్షంలో హెచ్ఆర్ఏగా చెల్లించబడుతుంది
ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన సంస్థ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఇంటర్వ్యూ జరిగే తేదీ 30 మే 2024 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం యొక్క వివరాలు కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి అర్హతలు కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి |
---|---|
వాట్సాప్ గ్రూప్ | టెలిగ్రామ్ గ్రూప్ |
Leave a Comment