Private Jobs

రాతపరీక్ష లేకుండా మెరిట్ చూసి జాబ్ ఇస్తారు డిగ్రీతో 85వేలకు పైగా జీతం ఉంటుంది

భారత తపాలా శాఖ ద్వారా నిర్వహించబడుతున్న న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న తన శాఖలలో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇవి ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు అయితే కాదు కేవలం మూడు సంవత్సరాల కాల పరిమితి కోసం కాంట్రాక్ట్ పదవి ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేరినారు ఈ మూడు సంవత్సరాల ఒప్పంద కాలంలో మొదటి సంవత్సరం సంస్థ యొక్క అవసరం మరియు అభ్యర్థి యొక్క పనితనం మరియు క్రమశిక్షణను బట్టి తరువాతి రెండు సంవత్సరాలు తన ఉద్యోగ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంది.

భారత తపాలా శాఖ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఈ సంస్థలోని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపికైన అభ్యర్థులు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్రాంచీలలో లేదా న్యూఢిల్లీ ముంబై మరియు చెన్నై సర్కిలలో ఉన్న ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ బ్రాంచ్ లలో పని చేయవలసి ఉంటుంది.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now
📌 తెలంగాణ లో ఉద్యోగాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇండియన్ పోస్ట్ పేమెంట్ ద్వారా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఇందులో విభాగాల వారీగా చూసినట్లయితే అసోసియేట్ కన్సల్టెంట్ ఎగ్జిక్యూటివ్ 28 ఉద్యోగాలు కన్సల్టెంట్ ఎగ్జిక్యూటివ్ 21 ఉద్యోగాలు సీనియర్ కన్సల్టెంట్ ఎగ్జిక్యూటివ్ అయిదు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు విద్యార్హతల విషయానికి వస్తే భారతదేశంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగంలో బిఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ లేదా బీసీఏ లేదా బిఎస్సి అర్హత కలిగి ఉండాలి అలాగే నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత విభాగంలో అనుభవం అవసరం అవుతుంది ఇక వయసు విషయానికి వస్తే ఒకటి ఏప్రిల్ 2024 నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు 22 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి అలాగే రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వాన్ని నిబంధనల ప్రకారం వయసు పరిమితులు తడలింపు అనేది ఉంటుంది

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 10 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు ప్రతినెలా అన్ని అలవెన్స్లతో కలిపి వేతనం అనేది చెల్లిస్తారు

🔥 ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక ఎంపిక విధానం చూసినట్లయితే నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం డిగ్రీలో సాధించిన మార్కులు గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది లేదా ఆన్లైన్ రాత పరీక్ష లేదా గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు యొక్క అధికారిక వెబ్సైట్ నందు ఉంచబడుతుంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు దరఖాస్తు ఫీజులు కూడా చెల్లించవలసి ఉంటుంది ఎస్సీ ఎస్టీ మరియు పిడబ్ల్యుడి అభ్యర్థులు 150 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి అలాగే మిగిలిన అభ్యర్థులు 750 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి

ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నాలుగు మే 2024 నుంచి ప్రారంభమైంది ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 24 మే 2024 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు

Apply Online

⭐  వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి ⭐  టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి
👉 వాట్సాప్ గ్రూప్ 👉 టెలిగ్రామ్ గ్రూప్

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!