మేషం 19-04-2024
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో చర్చలు సఫలమౌతాయి. ఆప్తుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృషభం 19-04-2024
కుటుంబ సభ్యులు మీ మాట విభేదిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అకారణంగా ఇతరులతో విరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్ధిక నష్ట సూచనలున్నవి.
మిధునం 19-04-2024
పితృ వర్గం వారితో మాటపట్టింపులు ఉంటాయి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటకం 19-04-2024
కుటుంబ విషయంలో ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి లాభాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి |
---|---|
Whatsap Group | Telegram Group |
Whatsap Group | Telegram Group |
సింహం 19-04-2024
ఆర్థిక పరిస్థితి మరింత మందగిస్తుంది. ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలలో ఆలోచనలు కలసి రావు ధన పరమైన విషయాలలో నిదానంగా వ్యవహరించుట మంచిది.
కన్య 19-04-2024
ఇంటాబయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు నష్టాలు అధిగమించి లాభాల బాట పడతాయి. ఖర్చుకు తగిన ఆదాయం లభిస్తుంది ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించా. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
తుల 19-04-2024
దూర దేశ సంచారం చేయవలసి వస్తుంది. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు. వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లాభించవు.
వృశ్చికం 19-04-2024
పాత రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధనాదాయం బాగుంటుంది. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు.
ధనస్సు 19-04-2024
ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభపడతారు. దాయాదులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులు లభించిన ఉన్నత అవకాశాలను జారవిడువకుండా చూసుకోవాలి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మకరం 19-04-2024
గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభ వార్తలు అందుతాయి.
కుంభం 19-04-2024
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ధన విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బందిపడతారు. వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.
మీనం 19-04-2024నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు.
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి |
---|---|
Whatsap Group | Telegram Group |
Whatsap Group | Telegram Group |
Leave a Comment