Govt Jobs

జాతీయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ ఉద్యోగాలు కేవలం రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ పద్ధతిలో మాత్రమే భర్తీ చేయనున్నారు ఇవి పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కాదు

నాబార్డ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థ కాబట్టి ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక నిరుద్యోగ మహిళ మరియు పురుష అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30 ఏప్రిల్ 2024

నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నడిచే సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఫైనాన్స్ అండ్ మైక్రో ఫైనాన్స్ సంస్థ నుంచి మొత్తం 2 రీసెర్చ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది

ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుని అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా పరిశోధన సంస్థ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి

నాబార్డ్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు వయస్సు పరిమితి 31 మార్చి 2024 నాటికి 45 సంవత్సరాలు పెంచకుండా ఉండాలి అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు వయస్సు పరిమితులు సడలింపు అనేది ఉంటుంది

నాబార్డ్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక విధానం అనేది రెండు దశలలో ఉంటుంది అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు డేటా విశ్లేషణకు సంబంధించిన ఈ రాత పరీక్షలు విజువలైజేషన్ అసెస్మెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అనేవి జరుగుతుంది

ఆసక్తి అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు నా బార్డ్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు దరఖాస్తు ఫీజును కూడా చెల్లించాలి అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 590 రూపాయలను ఆన్లైన్ ద్వారా చెల్లించాలి అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తు ఫారం మరియు సంబంధిత సర్టిఫికెట్లు అన్నీ క్రింద తెలిపిన ఈ మెయిల్ ఐడి కి మెయిల్ ద్వారా పంపించాలి. దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఈమెయిల్ చేయడానికి చివరి తేదీ 30 ఏప్రిల్ 2024 కాబట్టి ఆసక్తి మరియు అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరు నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము

Email :: recruitment.bird@nabard.org

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!