భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించే సైనిక్ స్కూల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాలు అన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
సైనిక్ స్కూల్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎనిమిది ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మ్యూజిక్ టీచర్ లోయర్ డివిజన్ క్లాక్ డ్రైవర్ వార్డ్ బాయ్ మరియు జనరల్ ఎంప్లాయ్ ఇంకా మ్యూజిక్ టీచర్ లేదా బ్యాండ్ మాస్టర్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
సైనిక్ స్కూల్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ఉద్యోగాల విభాగాల వారీగా అర్హతలు నిర్ణయించడం జరిగింది అభ్యర్థులు వివిధ ఉద్యోగాలను బట్టి పదవ తరగతి ఇంటర్మీడియట్ లేదా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
సైనిక్ స్కూల్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు వయస్సు పరిమితి కనీసం 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు బీసీ కేటగిరి అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు వయస్సు పరిమితిలో మినహాయింపు ఉంటుంది
ఆసక్తి మరియు అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తు ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది జనరల్ మరియు బీసీ కేటగిరి అభ్యర్థులు 500 రూపాయలు మరియు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 250 రూపాయలను డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించవలసి ఉంటుంది
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక విధానం అనేది రెండు దశలో ఉంటుంది మొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో కూడా ఉత్తీర్ణులైన అభ్యర్థులను చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది
సైనిక్ స్కూల్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు 4 మే 2024 సాయంత్రం ఐదు గంటలలోపు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
అభ్యర్థులు సైనిక్ స్కూల్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ లో ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదివి అప్లికేషన్ ఫారం ఫిలప్ చేసి తగు విద్యార్హత సర్టిఫికెట్లు జతపరిచి దాంతో పాటుగా ఫీజు యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ ను చేతపరిచి క్రింద ఇచ్చిన అడ్రస్కు 4 మే 2024 సాయంత్రం ఐదు గంటల లోపల చేరునట్లు పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి
అడ్రస్ : ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్ అమేథి, కౌహర్ షాఘర్, జిల్లా అమేథి, ఉత్తరప్రదేశ్-227411.
👉 notification:
Leave a Comment