కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నవోదయ విద్యాలయ సమితి నుంచి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హెల్పర్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ తదితర ఉద్యోగాలను బట్టి చేయనున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులైన పురుష మరియు మహిళా అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాల వివరాలు వయస్సు అర్హతలు తదితర సమాచారం కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ని పూర్తిగా చదివి నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
నవోదయ విద్యాలయ సమితి నుంచి మొత్తం 1137 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ల్యాబ్ అటెండెంట్ మెస్ హెల్పర్ అసిస్టెంట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ లీగల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ కంప్యూటర్ ఆపరేటర్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు
విభాగలవారీగా ఖాళీల వివరాలు
క్యాటరింగ్ సూపర్వైజర్ 78 పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్ రెండు పోస్టులు స్టెనోగ్రాఫర్ 23 పోస్టులు జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ నాలుగు పోస్టులు లీగల్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఐదు పోస్టులు ఆడిట్ అసిస్టెంట్ 12 పోస్టులు ఫిమేల్ స్టాఫ నర్స్ 121 పోస్టులు మెస్ హెల్పర్ 442 పోస్టులు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 381 పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 19 పోస్టులు ల్యాబ్ అటెండెంట్ 161 పోస్టులు, మరియు ఎలక్ట్రిషన్ కం ప్లంబర్ 128 పోస్టులు భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
నవోదయ విద్యాలయ సమితి నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని వివిధ ఉద్యోగాలకు వివిధ విద్యార్హతలు నిర్ణయించబడ్డాయి నోటిఫికేషను ప్రకారం పదవ తరగతి ఎలక్ట్రిషన్ లేదా వైర్ మెన్ ట్రేడ్లో ఐటిఐ పాసైన అభ్యర్థులు ఇంకా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇతర విద్యార్హతల వివరాలు కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
నవోదయ విద్యాలయ సమితి నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వివిధ వేద ఉద్యోగాలను బట్టి వయస్సు పరిమితి నిర్ణయించడం జరిగింది. పదవ తరగతి సర్టిఫికెట్ లో ఉన్న డేటాఫ్ బర్త్ ఆధారంగా అభ్యర్థి యొక్క వయస్సు అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా వివిధ ఉద్యోగాలను బట్టి 28 సంవత్సరాలు 30 సంవత్సరాలు 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు బిసి కేటగిరి అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు వయస్సు పరిమితులు సడలింపు ఉంటుంది
నవోదయ విద్యాలయ సమితి నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు ఈ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
ఆసక్తి అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు నవోదయ విద్యాలయ సమితి నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తు ఫీజు కూడా చెల్లించవలసి ఉంటుంది జనరల్ కేటగిరి అభ్యర్థులు దరఖాస్తు ఫీజు 1500 రూపాయలను చెల్లించవలసి ఉంటుంది మిగతా అభ్యర్థులు 1000 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి
ఆసక్తి మరియు అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి నవోదయ విద్యాలయ సమితి యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫారం మరియు నోటిఫికేషన్ క్రింద ఇవ్వబడింది
Leave a Comment