మేషం 15-04-2024
అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. బంధువర్గంతో విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ విషయంలో ఆలోచన స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.
వృషభం 15-04-2024
చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది. వ్యాపారంలో చికాకులు తొలగుతాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి.
మిధునం 15-04-2024
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలు కలుగుతాయి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
కర్కాటకం 15-04-2024
ఇంటాబయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది.
సింహం 15-04-2024
కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి విమర్శలు ఎదుర్కొంటారు. రావలసిన బాకీలు సమయానికి అందక ఇబ్బంది పడతారు. స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారమున ఇతరులతో ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగమున విలువైన పత్రాలు విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
కన్య 15-04-2024
వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి విజయం సాధిస్తారు. వ్యాపారపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో చర్చలకు అనుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల 15-04-2024
వృత్తి వ్యాపారమున ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి.పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.
వృశ్చికం 15-04-2024
బంధు మిత్రుల వియోగం భాదను కలిగిస్తుంది.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. సోదరుల ప్రవర్తన వలన మానసిక సమస్యలు పెరుగుతాయి.వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మాత్రంగా సాగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనస్సు 15-04-2024
అనుకున్న వ్యవహారాలు సజావుగా సాగవు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ప్రవర్తన వలన శిరో బాధలు కలుగుతాయి. వ్యాపారమున తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగాలలో పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. విలువైన పత్రాలు విషయంలో జాగ్రత్త వహించాలి.
మకరం 15-04-2024
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. గృహమునకు ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
కుంభం 15-04-2024
గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు ఆశించిన రీతిలో ఉంటాయి. ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యలు నుండి కొంత ఊరట కలుగుతుంది.సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు.
మీనం 15-04-2024
మానసికంగా స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. పాతరుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
Leave a Comment