Andhra Pradesh

స్వంత రాష్ట్రంలో పోస్టింగ్ అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ కేవలం డిగ్రీ తో పర్మినెంట్ జాబ్

ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలో ఉన్న వైయస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కాబట్టి ఆసక్తి మరియు అర్హతలు ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 15 మార్చి 2024 నుంచి 6 ఏప్రిల్ 2024 సాయంత్రం ఆరు గంటల లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి పూర్తి సమాచారం కోసం క్రింది ఇచ్చిన వివరాలను చదవగలరు లేదా క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

విజయవాడలో ఉన్న వైయస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి అసిస్టెంట్ లైబ్రేరియన్ ఒక్క ఉద్యోగం ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు ముప్పై నాలుగు వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వేతనం ఇవ్వడం జరుగుతుంది.

ఈ అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు పరిమితి 1 జూలై 2024 నాటికి 40 రెండు సంవత్సరాలకు మించకుండా ఉండాలి అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ బిసి మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకూ వయసు పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజు గా జనరల్ కేటగిరీ అభ్యర్థులు 1500 రూపాయలు అలాగే ఎస్సీ ఎస్టీ మరియు ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు 750 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి విడుదలైన అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ లో లైబ్రరీ సైన్స్ పాస్ అయి ఉండాలి. లేదా కంప్యూటర్ అప్లికేషన్ విభాగంలో పీజీ డిప్లమా పూర్తిచేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం లైబ్రేరియన్ అసిస్టెంట్గా రెండు సంవత్సరాలపాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారిచే రాతపరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో కూడా ఉత్తీర్ణులైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది ఆసక్తి మరియు అర్హతలు ఉన్నా ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు 15 మార్చి 2024 నుంచి 6 ఏప్రిల్ 2024 వరకు డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యొక్క అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

NOTIFICATION

APPLY ONLINE

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!