కేవలం పదవ తరగతి విద్యార్హతతో పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి అవకాశం. నవోదయ విద్యాలయ సమితి నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కేవలం పదవ తరగతి పాసైన నిరుద్యోగ విద్యార్థులందరూ ఈ ఉద్యోగాలకు 26 మార్చి 2024 నుంచి 29 ఏప్రిల్ 2024 లోపు నవోదయ విద్యాలయ సమితి యొక్క అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ మహిళలు మరియు పురుషులు అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1377 లను భర్తీ చేయనున్నారు. నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ నందు గల ఉద్యోగాల ఖాళీల వివరాలు విభాగాల వారీగా గమనించినట్లయితే
- క్యాటరింగ్ సూపర్వైజర్ 78 పోస్టులు
- కంప్యూటర్ ఆపరేటర్ రెండు పోస్టులు
- స్టెనోగ్రాఫర్ 23 పోస్టులు
- లీగల్ అసిస్టెంట్ ఒక పోస్ట్
- ఆడిట్ అసిస్టెంట్ 12 పోస్టులు
- జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ 4 పోస్టులు
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు
- ఫిమేల్ స్టాఫ్ నర్స్ 121 పోస్టులు
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 19 పోస్టులు
- హెల్పర్ 442 పోస్టులు
- ల్యాబ్ అటెండెంట్ 161 పోస్టులు
- ఎలక్ట్రిషన్ & ప్లంబర్ 128 పోస్టులు
- జూనియర్ సెక్రెటరీఎట్ అసిస్టెంట్ 381 పోస్టులు
ఇలా మొత్తం ఒక వెయ్యి 337 ఉద్యోగాల భర్తీకి నవోదయ విద్యాలయ సమితి నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది
విద్యార్హతల విషయానికొస్తే ఈ నోటిఫికేషన్ లో గల మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగానికి కేవలం పదవ తరగతి పాసైన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రిషన్ ప్లంబర్ ఉద్యోగానికి తరగతితో పాటు ఎలక్ట్రిషన్ లేదా వైర్మాన్ ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే వైరింగ్ లేదా ప్లంబింగ్ రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. ఇంకా మెస్ హెల్పర్ ఉద్యోగానికి పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ మెస్ లో కనీసం 5 సంవత్సరాల పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
నవోదయ విద్యాలయ సమితి నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మొదట రాత పరీక్ష ట్రేడ్ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది.
ఆసక్తి అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల లో ఉన్నా పురుష మరియు మహిళా అభ్యర్థులు ఈ నవోదయ విద్యాలయ సమితి యొక్క ఉద్యోగాలకు 26 మార్చి 2024 నుంచి 29 ఏప్రిల్ 2024 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Leave a Comment