Meeku Telusa

మౌర్య సామ్రాజ్యం | Mourya Empire

చండశాసనుడుగా గుర్తింపు పొందిన మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అశోకుడు ఒక్క ఘటనతో మారిపోయాడు. ఇంతకీ అశోకుని అంతలా మార్చిన ఆ సంఘటన ఏంటి అశోకుడి పాలన ఎలా సాగింది. అశోకుని తర్వాత తరాల పరిస్థితి ఏంటి. మొదలైన వివరాలు ఈ రోజు చెప్పుకుందాం

సింహాసనం కోసం తన 99 మంది సోదరులను హతమార్చడం చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడయ్యాక విధేయత లేని తన సిబ్బందిని చంపడం, తనకు ఆనందాన్ని కలిగించిన చెట్టును అందవిహీనంగా చేసిన తన ఉంపుడు గత్తెలను సజీవదహనం చేయించిన చరిత్ర అశోకుడిది.

అయితే ఒక్క యుద్ధం అశోకున్ని పూర్తిగా మార్చేసింది

అశోకుడు రాజుగా పట్టాభిషిక్తుడు అయ్యేనాటికి మౌర్య సామ్రాజ్యం భారత ఖండంలో కళింగ దేశం మినహా దాదాపు అన్ని ప్రాంతాలకు విస్తరించింది. దీంతో చక్రవర్తి అయిన ఎనిమిదేళ్లకు అంటే క్రీస్తు పూర్వం రెండు వందల అరవై రెండవ సంవత్సరంలో అశోకుడు కళింగ దేశంపై యుద్ధం ప్రకటించాడు

ఆ యుద్ధం చాలా భీకరంగా సాగింది. కళింగ , మౌర్య సామ్రాజ్యాల మధ్య జరిగిన ఈ పోరు భారత చరిత్రలోనే అత్యంత భీకరయుద్ధంలో ఒకటిగా నిలిచింది. నిజానికి మౌర్యులకు ముందు కళింగ రాజ్యం మగధ రాజ్యం అధీనంలోనే ఉండేది.

ధనందుడి హయాం వరకు ఇది మగధ రాజ్యం లో ఒక భాగం. ఇక చంద్రగుప్తుడు వచ్చాక ఈ కళింగ రాజ్యం వేరయింది. దీన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చంద్రగుప్తుడు ఆ తర్వాత తరంలో బిందుసారుడు కూడా ప్రయత్నించాడు. కానీ కళింగులు లొంగలేదు. చివరకు అశోకుడు హయాంలో మరోసారి మౌర్య రాజ్య సేనలు కళింగ పై సమర శంఖం పూరించాయి. భీకరంగా జరిగిన ఈ పోరులో చివరకు అశోకుడు పైచేయి సాధించాడు

విజయగర్వంతో అశోకుడు యుద్ధ భూమిని తిలకించాడు. కానీ అక్కడి దృశ్యాలు చూసి చండశాసనుడు , క్రూరుడు గుర్తింపుపొందిన అశోకుడి మనసులోనూ విషాదఛాయలు అలముకున్నాయి. నలుదిక్కులా కళేబరాలతో నిండిపోయింది ఆ యుద్ధ భూమి ఒక స్మశానం లాగా మారింది. ఆ నేలపై రక్తం ఏరులై ప్రవహిస్తుంది. దాహం దాహం అంటూ క్షతగాత్రుల ఆర్తనాదాలతో… తోటి వాళ్ళు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి ఇరుపక్షాల సైనికులూ దుఃఖం ఆపుకోలేక పోయారు.

రెండు సైన్యాల తరపున దాదాపు లక్ష మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని పలువురు చరిత్రకారులు వాదన.

ఈ హృదయ విదారక దృశ్యం చూసిన అశోకుడి కళ్ళు అప్రయత్నంగానే కళ్ళలో కన్నీటి బిందువులు నేలరాలాయి. ఇక అప్పట్నుంచి హింసకు దూరంగా ఉండాలని అహింస మార్గంలోనే నడుచుకోవాలని నిశ్చయించుకున్నాడు అశోకుడు. దీంతో అప్పటి నుంచి దండయాత్రలు యుద్ధాలు మానేసి ఆస్థానంలో శాంతి చాటడం మొదలుపెట్టాడు

ఓ రకంగా అప్పట్లో దక్షిణాది ప్రాంతాల్లో పాలిస్తున్న చోళులు, పాండ్యులు మొదలైన రాజులపై అశోకుడు దండెత్తక పోవడానికి కారణం కూడా ఇదే. ఆ చిన్న రాజ్యాలపై దండెత్తడం సరికాదని అశోకుడు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకున్నాడు. లేదంటే అశోకుని మౌర్య సామ్రాజ్యం ధాటికి మన దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడో చెల్లాచెదురై పోయేవి.

ఇక కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అయితే అశోకవదన పుస్తకం మాత్రం అశోకుడు బౌద్ధ మతం లోకి మారాక కూడా కొన్ని సందర్భాల్లో హింసను ఆచరించడాని చెబుతోంది

మౌర్యుల కాలంలో బౌద్ధం, జైన్, హైందవంతో పాటు అజీవక అనే సిద్ధాంతం కూడా ఉండేది. ఇది ఆ కాలంలో ఎక్కువగా ఆదరణ పొందే బౌద్ధ, జైన సిద్ధాంతాలకు భిన్నమైంది. బిందుసారుడు అతని భార్య ఈ అజీవక సిద్ధాంతాన్ని అనుసరించే వారు. ఈ సిద్ధాంతాన్ని అనుసరించే వారిని అజీవకులు అంటారు.

వీరు కర్మ స్వేచ్ఛ మొదలైన వాటికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు. అలాగే ఎన్నో బౌద్ధ జైన సిద్ధాంతాలను విభేదించే వాళ్ళు. మౌర్య సామ్రాజ్యం పరిధిలోని పుండ్రవర్ధన రాజ్యం అంటే ఇప్పటి బంగ్లాదేశ్ కు చెందిన ఓ బౌద్ధ ఇతర కళాకారుడు.. బుద్ధుడు ఒక జైన గురువుకు పాదాభివందనం చేస్తున్నట్టుగా ఓ చిత్రాన్ని తీశాడు. దీనిపై ఓ బౌద్ధ సన్యాసి అశోకుడికి ఫిర్యాదు చేయగా ఆ కళాకారుడి బంధించమని చెప్తాడు. అంతటితో ఆగకుండా పుండ్రవర్ధన లో నివసిస్తున్న 18 వేల మంది అజీవకులను కూడా హతమార్చాలని ఆదేశిస్తాడు

ఈ క్రమంలోనే భటులు అశోకుడు తోడబుట్టిన సోదరుని అజీవక వర్గానికి చెందిన వాడని పొరబడి హతమారుస్తారు. ఆ తర్వాత తప్పును తెలుసుకున్న అశోకుడు తన ఆదేశాలను రద్దు చేస్తాడు అయితే ఈ కథ పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి అనుకోండి అది వేరే విషయం.

ఇక అశోకుడి పాలన ఎలా సాగిందో చూద్దాం….

ఇప్పుడు మనం పట్టణాల్లో రోడ్లకు ఇరువైపులా చెట్లు , తాగు నీటి సదుపాయాలు ఉండటం చూసి అబ్బో మనది గ్రీన్ సిటీ అనుకుంటూ మురిసిపోతున్నాం. ఈ పద్ధతి విదేశాల నుంచి వచ్చిందని చాలా మంది అనుకుంటారు కానీ వేల సంవత్సరాల క్రితమే అశోకుడు ఇలా రోడ్ల పక్కన వీధుల్లో పచ్చదనం పెంచేందుకు చెట్లను నాటించాడు. అందుకే అంటారు అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించెను అని మనం పాఠ్యపుస్తకాలలో చదువుకున్నాం.

ఎక్కడికక్కడ బావులు తవ్వించాడు, మనుషులతో పాటు పశువుల కోసం కూడా ప్రత్యేక ఆసుపత్రిలు నిర్మించాడు. వేట ను రద్దు చేసి ఆ స్థానంలో స్వయంగా తానే తన రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి వాళ్ళ సమస్యలను తెలుసుకొని పరిష్కరించసాగాడు. అంతేకాకుండా అక్కడి వారికి అహింస పైన అవగాహన పెంచేందుకు కృషి చేశాడు. ఈ క్రమంలోనే దేశంలోని అనేక ప్రాంతాల్లో స్థూపాలు కూడా ఏర్పాటు చేశాడు

ఇది రాజు ఆజ్ఞ… పాటించి తీరాల్సిందే వంటి హెచ్చరికలకు బదులు… ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలకు విలువ ఇస్తూ అశోకుడు పాలన కొనసాగించాడు. నిష్పక్షపాతంగా అందరికీ న్యాయం చేకూరేలా తీసుకుంటున్న చర్యలకు అశోకుడు ప్రజల నుంచి మన్ననలు కూడా పొందాడు. అలా అశోకుడు దాదాపు 30 ఏళ్ల పాటు మౌర్య సామ్రాజ్యాన్ని సుభిక్షంగా చూసుకున్నాడు. ఇక అశోకుడి కాలం తరువాత మౌర్య సామ్రాజ్యం క్షీణించడం మొదలైంది.

అశోకుడి కుమారుల్లో పెద్దవాడైన మహీంద్రా సన్యాసం స్వీకరించాడు. రెండవ కుమారుడు కునాల మౌర్య గుడ్డి వాడు కావడంతో వారసుడిగా అర్హత సాధించలేకపోయాడు. మూడవ కుమారుడు తిబల అశోకుడి కంటే ముందే మరణించాడు.

ఇక అశోకుడి తరువాత మౌర్య రాజ్యపాలన మంత్రుల పర్యవేక్షణలో జరిగింది. కొంతకాలానికి అశోకుడి మనవడు దశరథ మౌర్య బాధ్యతలు తీసుకున్నాడు. కానీ దశరథ మౌర్య హయాంలో ఎన్నో ప్రాంతాలు మౌర్య సామ్రాజ్యం నుంచి చేజారిపోయాయి. ఆ తర్వాత వచ్చిన కునాల మౌర్య కుమారుడు సంప్రాతి మౌర్య రాజ్యాన్ని పునరుద్ధరించాడు. సంప్రాతి మౌర్య తర్వాత మరో సారి మళ్ళీ మౌర్య రాజ్య పతనం మొదలైంది

క్రీస్తు పూర్వం 180 వ సంవత్సరంలో బృహద్రధ మౌర్య అతని సేనాని పుష్యమిత్ర సుంగ చేతిలో వెన్నుపోటుకు గురికావడంతో మౌర్య సామ్రాజ్య వైభవం ముగిసింది.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!