తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళా అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న ఖాళీల భర్తీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లు ఉద్యోగాల కోసం తక్షణమే నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో విడివిడిగా ఉద్యోగ ప్రకటనలు విడుదల కానున్నాయి.
ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు వివాహితులే ఉండాలి. దానితోపాటు కనీస విద్యార్హతగా అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు పదవ తరగతి పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్వాడీ హెల్పర్లు ఉద్యోగాలకు ఈ పాస్ అయిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాతపరీక్ష లేకుండా విద్యార్థులు వచ్చిన మార్కులు స్థానికత మరియు ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు
👉మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అవ్వండి