Andhra Pradesh Private Jobs

Jobs in Kadapa | కడపలో ఈ నెల 13 జాబ్ మేళా

కడప జిల్లాలో ఐటీఐ ఉత్తీర్ణు లైన విద్యార్థులకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటీస్ కమ్ రోజ్ గార్ మేళా మరియు మినిస్ట్రీస్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైన్యూర్ వారి ఆధ్వర్యంలో దేశమంతటా ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు అప్రెంటీస్ మేళాను నిర్వహిస్తున్నట్లు కడప ప్రభుత్వ ఐటీఐ మైనార్టీ జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ జ్ఞానకుమార్ తెలిపారు.

ఇందులో భాగంగా కడపలోని ప్రభుత్వ డీఎల్డీసీ/ఐటీఐ నందు 12వ తేదీ ఉదయం 10 గంటలకు అప్రెంటీస్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇందులో వివిధ కంపెనీలు పాల్గొని తమకు కావాల్సిన ట్రేడ్ విద్యార్థులను ఎంపిక చేసుకుంటారన్నారు. ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు తమ విద్యార్హ తల సర్టిఫికెట్స్, ఐటీఐ ఎన్టీసీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, బ్యాంకు అకౌంట్ పుస్తకం, పాస్ పోర్టు సైజ్ ఫొటోతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకురావాలన్నారు. అప్రెంటీస్ షిప్ సందర్భంగా నెలకు రూ.8050 చెల్లిస్తామన్నారు.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!