కీట్స్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత నైపుణ్యాల శిక్షణను విజయవాడలో అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా వారికి హెల్త్ కౌన్సిలర్, హెల్త్ కోఆర్డినేటర్ విభాగాలలో నైపుణ్య శిక్షణ ఉంటుందని తెలిపారు.
రెండు నెలల పాటు వారికి అత్యుత్తమ శిక్షణను అందించడం జరుగుతుందని తెలిపారు. 19 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులని తెలియజేశారు. డిగ్రీ పాసై, పీజీ పాస్/ ఫెయిల్ అయిన వారు అర్హులన్నారు. విజయవాడలో నిర్వహించే నైపుణ్య శిక్షణలో వారికి ఉచితంగా భోజనం వసతి కల్పించడం జరుగుతుందన్నారు.
శిక్షణ సమయంలో హెల్త్ కేర్ సెక్టార్ స్కిల్స్, హాస్పిటల్ మేనేజ్మెంట్, కస్టమర్ రిలేషన్స్, లైఫ్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ లలో అత్యుత్తమ శిక్షణ ఉంటుందని తెలిపారు. వారికి విజయవాడలోని కీట్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అంబారుపేట నందిగామ మండలం లో శిక్షణ ఉంటుందని తెలిపారు.
ఈనెల తొమ్మిదవ తేదీన బ్యాచ్ ప్రారంభమవుతుందని శిక్షణ పూర్తి చేస్తున్న వారికి మేజర్ నగరాలలో ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 90004 87423 నెంబర్కు సంప్రదించాలన్నారు.
Leave a Comment