Andhra Pradesh Govt Jobs

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చివరి తేదీ 7 ఫిబ్రవరి

ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 234 స్పెషలిస్ట్ డాక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 7 ఫిబ్రవరి 2024 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉 సంస్థ పేరు : ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్

👉ఉద్యోగం పేరు : స్పెషలిస్ట్ డాక్టర్

👉ఉద్యోగాల వివరాలు:

జనరల్ మెడిసిన్ డాక్టర్ 38 పోస్టులు

ప్రసూతి శాస్త్రం మరియు గైనకాలజీ 37 పోస్టులు

ఏపీడేమియాలజిస్ట్ 15 పోస్టులు

కార్డియాలజిస్ట్ లేదా జనరల్ మెడిసిన్ 29 పోస్టులు

పిల్లల వైద్యుడు 114 పోస్టులు

👉మొత్తం ఉద్యోగాల సంఖ్య : 234

👉జీతం ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వారి యొక్క పోస్టులు బట్టి జీతం నెలకు 60 వేల రూపాయల నుంచి ఒక లక్షా 40 వేల రూపాయల వరకు ఉంటుంది

👉విద్యార్హతలు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఎం బి బి ఎస్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా లేదా ఎండి లేదా ఎం పి హెచ్ పూర్తి చేసి ఉండాలి

👉వయసు పరిమితి: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు వయసు పరిమితి 31 జనవరి 2024 నాటికి 42 సంవత్సరాలు ఉండాలి అలాగే ఈడబ్ల్యూఎస్ లేదా ఎస్సీ లేదా ఎస్టీ లేదా బిసి కేటగిరీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయసు పరిమితులు సడలింపు ఉంటుంది

👉దరఖాస్తు ఫీజు: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు బిసి ఎస్టి ఎస్సి ఈడబ్ల్యూఎస్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి ఓసి కేటగిరీ అభ్యర్థులు 1000 రూపాయలను దరఖాస్తు ఫీజు చెల్లించాలి

👉ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూల మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది

👉దరఖాస్తు విధానం: ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా 7 ఫిబ్రవరి 2024 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించుకోవాలి

నోటిఫికేషన్

👉 మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవండి

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!