నిరుద్యోగులకు శుభవార్త… కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వేశాఖ తీపి కబురు అందించింది. ఫిబ్రవరి నెలలో దాదాపు తొమ్మిది వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు.
👉 ఈ మేరకు నియామక షెడ్యూల్ ను తాజాగా విడుదల చేసింది ఉద్యోగ ప్రకటన ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది.
👉 ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు తొమ్మిది వేలకు పైగా టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందరికీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేసుకోనున్నారు. అందులో పాసైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
👉 ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన టువంటి ఇండియన్ రైల్వేస్ లో భాగంగా పాట్నా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది.
👉 ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి నెలలో తొమ్మిది వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కానుండగా ఆన్లైన్ దరఖాస్తులు మార్చి లేదా ఏప్రిల్ నెలలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
👉 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ను అక్టోబర్ లేదా డిసెంబర్ 2024 లో నిర్వహించే అవకాశం ఉంది ఈ ఆన్లైన్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిబ్రవరి 2025 లో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆసక్తి మరియు అర్హతలు కలిగిన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అందరూ ఈ నోటిఫికేషన్ విడుదల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు
👉ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి