ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులకు మరో శుభవార్త చెప్పింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గ్రూప్ వన్ మరియు గ్రూప్ 2 ఉద్యోగాలతో పాటు వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి మీకు అందరికీ తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి నెలలో డీఎస్సీ మరియు టెట్ 2024 నోటిఫికేషన్ను విడుదల చేసే అవకాశం ఉంది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది 2022 మరియు 2023 కాలంలో బీఈడీ లేదా డీఈడీ పూర్తి చేసిన వారికి కూడా ఈ నోటిఫికేషన్ లో అవకాశం కల్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టు లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు కాగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మరియు డీఎస్సీని విడివిడిగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. TET సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులు భారీగా వస్తే పరీక్ష నిర్వహణకు 15 రోజులు పట్టే అవకాశం ఉంది. కాబట్టి TET తో పాటు పది నుంచి పదిహేను రోజులు అటూ ఇటుగా డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ మరియు పరీక్షల నిర్వహణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు దాదాపుగా 6 వేల ఉద్యోగాల తో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఇందులో మొదటగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహించి ఆ ఫలితాలు వచ్చిన తర్వాత డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డీఎస్సీ, టెట్ మార్కులకు 25 శాతం వెయిటేజి ఉంది కాబట్టి ముందుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరియు డిఎస్సి లకు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు.
Leave a Comment