దక్షిణ మధ్య రైల్వే దేశ వ్యాప్తంగా గల వర్క్ షాప్ లు మరియు యూనిట్ ల యందు పని చేయడానికి అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు ట్రేడ్ లను అనుసరించి 15 నెలల నుండి రెండు సంవత్సరాలు మరియు కొన్ని ట్రేడ్ లకు ఒక సంవత్సరం వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవండి
ఉద్యోగం పేరు : అప్రెంటిస్
మొత్తం ఖాళీలు : 2860
ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు : మిషనిస్ట్, ఎలక్ట్రీషిన, పెయింటర్, కార్పెంటర్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, డీజల్ మెకానిక్, తదితరాలు
విద్యార్హతలు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ట్రేడ్ లను అనుసరించి పదవతరగతి లేదా ఇంటర్ మీడియట్ లో 50 శాతం మార్కులతో పాస్ అయి ఉండి సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ పాస్ అయి ఉండాలి.
దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే జనరల్ మరియు ఓబిసి అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి, ఎస్సి, ఎస్టీ, మరియు దివ్యంగ , మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం : ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు ప్రారంభ తేదీ : 29-01-2024
దరఖాస్తుకు చివరి తేదీ : 28-02-2024
Leave a Comment