మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ చానల్ లో జాయిన్ అవండి
నీ గొప్ప ఆలోచనల గురించి, నీ లక్ష్యం గురించి, నువ్వు ఎంచుకున్న మార్గం గురించి ఎవ్వరికీ తెలియనివ్వకు. లక్ష్య సాధనలో నువ్వు ముందుకెళ్లేటప్పుడు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ముందుకెళ్లాలి. అప్పుడే నీ చుట్టూ ఉన్నవారికి నువ్వు ప్రయాణం చేయబోతున్న మార్గం అర్థం కాదు. అలా కాకుండా మన లక్ష్యం గురించి అందరికీ చెబితే.. కొందరు అభినందించి ప్రోత్సహించినా ఎక్కువమంది మనల్ని చూసి నవ్వుతారు. మన లక్ష్యాన్ని హేళన చేస్తారు.. అలాంటి వాళ్ల వల్ల మన ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే నిశ్శబ్దంగా నీ పయనం సాగించు. నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు నీ గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. అప్పుడు నిన్ను విమర్శించిన వారే నిన్ను హీరోలా చూస్తారు.
పరిగెతడానికి వెనుకాడినంత కాలం పోటీలో గెలవడం అసాధ్యం జీవితంలో ఎన్నో చేయాలనుకుంటారు చాలామంది. కానీ వాటికోసం పోరాడే విషయంలోనే వెనుకడుగు వేస్తుంటారు. దాని గురించే ఆచార్య చాణక్యుడు ఏం చెప్తారంటే.. ఏదైనా సాధించాలని బలంగా నిర్ణయించుకున్నప్పుడు, పోటీలో గెలవాలని పట్టుదలతో పోరాడినప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవల్సి వస్తుంది. వాటన్నింటినీ తట్టుకుని నిలబడితేనే కల సాకారమవుతుంది. అలా కాకుండా చిన్న కష్టం ఎదురుకాగానే పోటీ నుంచి తప్పుకుంటే జీవితంలో ఓడిపోయిన వ్యక్తిగా మాత్రమే మిగిలిపోతావ్. లక్షాన్ని ఎన్నటికి చేరుకోలేవ్. అందుకే ఓ లక్ష్యం కోసం పోరాడే వ్యక్తి ఎప్పుడూ సాహసంతో ముందడుగు వేయాలి. అప్పుడు విజయమే అతడి ముందు తల వంచి దాసోహం అంటుంది.
రుచికరమైన భోజనం ఎదురుగా ఉన్నప్పుడు ఆనందంగా తినగలగాలి. అందమైన భార్య తోడుగా ఉన్నప్పుడు ఆమెతో సర్వసుఖాలు అనుభవించడగలగాలి. కష్టాల్లో ఉన్నవారు చేయి చాపినపుడు లేదనకుండా దానం చేయగలిగే ధనం కలిగి ఉండాలి. రుచికరమైన భోజనం ఎదురుగా ఉన్నప్పుడు ఆనందంగా తినగలగాలి. అందమైన భార్య తోడుగా ఉన్నప్పుడు ఆమెతో సర్వసుఖాలు అనుభవించడగలగాలి. కష్టాల్లో ఉన్నవారు చేయి చాపినపుడు లేదనకుండా దానం చేయగలిగే ధనం కలిగి ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణమైన జీవితం. కళ్లముందు పంచభక్ష పరమాన్నాలున్నా.. వాటిని కనీసం రుచి కూడా చూడలేరు కొంతమంది. కళ్లముందు రంభలాంటి భార్య ఉన్నా ఆమెతో సుఖించలేరు ఇంకొంతమంది. ఎవరైనా కళముందు చేయి చాపి యాచిస్తున్నా రూపాయి కూడా దానం చేసే స్థాయి మరికొంతమందికి ఉండదు. అలాకాకుండా ఒకవేళ నచ్చినంత తినగలిగి, భార్యతో ఆనందంగా గడపగలిగి, చేయిచాచి యాచించిన వారికి లేదనకుండా దానం చేయగలిగితే వారిని మించిన అదృష్టవంతులు ఉండరంటాడు కౌటిల్యుడు.
Leave a Comment