యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ లో ఉద్యోగాలు
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు కేవలం డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు సొంతం చేసుకోవచ్చు . ఆసక్తి అర్హతలు ఉన్న అభ్యర్థులు 23 జనవరి 2024 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు
ఉద్యోగం పేరు : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
మొత్తం ఖాళీల సంఖ్య 250 ఉద్యోగాలు
విద్యార్హత: ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి దాంతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి
వయస్సు పరిమితి : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి
దరఖాస్తు ఫీజు: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు గా ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుడి వారికి 250 రూపాయలు మరియు ఇతర అభ్యర్థులు వెయ్యి రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి
ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు ఈ ఆన్లైన్ టెస్ట్ లో చూపిన ప్రతిభ ఆధారంగా Shortlist చేసి మిగిలిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానము ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్సైట్ నుంచి 23 జనవరి 2020 4 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
Leave a Comment