632 ఖాళీలకు ఎం ఎల్ సి నోటిఫికేషన్ డిప్లమా బీటెక్ అర్హతతో అవకాశం నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లో 632 అప్రెంటిస్ ఖాళీలు
కేవలం డిప్లమా మరియు బీటెక్ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తమిళనాడు రాష్ట్రంలో ఉన్న నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక్క సంవత్సరం అప్రెంటీస్ శిక్షణలో భాగంగా ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు 18 జనవరి 2024 నుంచి 31 జనవరి 2024 లోపు నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్సైట్ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ అప్రెంటిస్ శిక్షణ అనేది ఒక్క సంవత్సరం వరకు మాత్రమే ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు తమిళనాడు రాష్ట్రంలోని నైవేలి లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ నందు చేయవలసి ఉంటుంది.
వివరాలు
సంస్థ పేరు : నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్
ఉద్యోగం పేరు : అప్రెంటీస్
ఉద్యోగాల వివరాలు
1 గ్రాడ్యుయేట్అప్రెంటీస్ 314 ఖాళీలు
2 డిప్లమో టెక్నీషియన్ అప్రెంటిస్ 318 ఖాళీలు
మొత్తం ఉద్యోగాల సంఖ్య 632 ఖాళీలు
విద్యార్హతలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా లేదా డిగ్రీ పాసై ఉండాలి
స్టైఫండ్ ఈ ఉద్యోగాలకు కేవలం ఒక సంవత్సరం మాత్రమే శిక్షణ ఇస్తారు శిక్షణ కాలంలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ కీ 15028 రూపాయలు టెక్నీషియన్ అప్రెంటిస్ కీ 12524 రూపాయలు స్టైఫండ్ గా ఇవ్వడం జరుగుతుంది
ఎంపిక విధానము ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను డిప్లమో లేదా డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు ముఖ్యంగా ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం అయ్యే తేదీ 18 జనవరి 2024
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 జనవరి 2024
అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడించే తేదీ 19 ఫిబ్రవరి 2024
అప్రెంటిస్ ప్రవేశ తేదీలు 23 ఫిబ్రవరి 2024 నుంచి 29 ఫిబ్రవరి 2024 వరకు
మరింత సమాచారం కోసం నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్ సైట్ నందు చూడగలరు