చాణక్యుడి దిశానిర్దేశం లో చంద్రగుప్తుడు మౌర్య రాజ్యాన్ని ఓ మహా సామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు. చంద్రగుప్త మౌర్య రాజ్య సింహాసనాన్ని అధిష్టించే సమయానికి కొంత కాలం ముందే అలెగ్జాండర్ భరతఖండం సరిహద్దుల వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోయాడు. ఇక బియాస్ నది వరకు అలెగ్జాండర్ ఆక్రమించుకున్న ప్రాంతాన్ని అతని తర్వాత అలెగ్జాండర్ దగ్గర జనరల్ గా పనిచేసిన సెల్యుకస్ నికేటర్ సెల్యుసిట్ రాజ్యాన్ని స్థాపించి పరిపాలించసాగాడు. రాజ్య విస్తరణలో భాగంగా ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ వస్తున్నా సెల్యుకస్ నికేటర్ పాలిస్తున్న ఆ ప్రాంతానికి దండెత్తాడు. ఆ క్రమంలో ఇరు వర్గాల మధ్య భీకర పోరు సాగింది. సుదీర్ఘకాలం పాటు నిర్విరామంగా ఈ యుద్ధం సాగింది. మౌర్యుల ధాటికి గ్రీకులు నిలువలేక పోయారు
హిందూ కుష్ పర్వత శ్రేణులు అంటే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ వరకు మౌర్యులు ఆక్రమించుకున్నారు. చంద్రగుప్తుడి సేనల సామర్ధ్యం తెలుసుకున్నా సెల్యుకస్ నికేటర్ ఇక యుద్ధం పొడిగించవద్దని భావించాడు. ఈ క్రమంలో ఇరు వర్గాలు శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయి
ఇరు రాజ్యాల మధ్య మైత్రి నెలకొల్పేందుకు నికేటర్ తన కుమార్తె అయిన బెరనీస్ ను చంద్రగుప్తుడుకి ఇచ్చి వివాహం చేశాడు. ఈమెను కొందరు చరిత్రకారులు హెలెనా అని పేర్కొంటారు. మరోవైపు పాళీ భాషలో ఈమెని సువర్ణాక్షిగా పేర్కొన్నారు నాటి చరిత్రకారులు.
అలా గ్రీకులు భారతీయుల దౌత్య సంబంధాలకు తొలిసారిగా బీజం పడింది. ఇక 301 వ సంవత్సరంలో ఇప్సస్ యుద్ధంలో సహాయంగా చంద్రగుప్తుడు 500 మదపుటేనుగులను పంపాడు. ఆ యుద్ధంలో ఘన విజయం సాధించిన నికేటర్ తనకు సాయం చేసినందుకు ప్రతిగా తన వద్ద ఉన్న చరిత్రకారుడు మెగస్తనీసు చంద్రగుప్తుని దర్బారులో గ్రీకు రాయబారి గా నియమిస్తాడు.
చంద్రగుప్తుని కుమారుడు బిందుసార విషయంలోనూ గ్రీకులతో సంబంధాలు కొనసాగాయి
సెల్యుసిట్ చక్రవర్తి నికేటర్ కుమారుడు అంతియోకోస్ డైమకోస్ ను మౌర్య రాజ్యానికి రాయబారిగా నియమిస్తాడు. చంద్రగుప్తుని కాలంలో మౌర్య సామ్రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వరకు కాశ్మీర్ నుంచి వింధ్యపర్వత శ్రేణులు వరకు విస్తరించింది.
చంద్రగుప్తుడు రాజ్యం సుభిక్షంగా సాగేందుకు పాలనా వ్యవస్థలను మూడు శాఖలుగా విభజించారు
గ్రామీణ వ్యవహారాలు, సాగు, భూకేటాయింపులు, అటవీ చట్టాలు, మౌళిక వసతులు మొదలైన అంశాలు ఒక శాఖలో… పట్టణ వ్యవహారాలు, వాణిజ్యం, వర్తకుల కార్యకలాపాలు, విదేశీయుల రాకపోకలు, రోడ్లు ,ఆలయాలు, మార్కెట్లు, పరిశ్రమలు మొదలైన అంశాలు మరో శాఖ పరిధిలోకి వచ్చేవి. పన్ను వసూళ్లు కూడా ఈ రెండు శాఖల పరిధిలోకి వచ్చేవి. సైన్యం ,ఆయుధ సరఫరా, సైనికుల అవసరాలు మొదలైనవి మూడు శాఖ పరిధిలోకి వచ్చేవి.
నంద వంశస్తుల పాలనలో అధర్మం ,అవినీతి ,అన్యాయం తాండవమాడేవి. మౌర్య సామ్రాజ్య స్థాపన లో మగధ రాజ్యం లో శాంతి నెలకొంది అని కౌటిల్యుడు తన అర్థశాస్త్ర గ్రంథంలో పేర్కొన్నాడు. చంద్రగుప్తుడి హయాంలో చాణిక్యుడి దిశానిర్దేశం లో మౌర్యసామ్రాజ్యం బలమైన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందింది. సాగు, ఆలయాలు, మైనింగ్, రోడ్లు… రాజ్యానికి ప్రధాన వనరులుగా ఉండేవి
చంద్రగుప్తుడు తన హయాంలో రాజ్యంలో ఎన్నో రిజర్వాయర్లు నిర్మించాడు చంద్రగుప్తుని కాలంలో హిందూ, జైన, బౌద్ధ మతాలకు ఆదరణ పెరిగింది మనదేశంలో ఇప్పుడున్న మిక్స్డ్ ఎకానమీ వ్యవస్థ చంద్రగుప్తుని కాలంలోనూ ఉండేది. ఆయుధ కర్మాగారాలు ప్రభుత్వాధీనంలో ఉండేవి.
అయితే గనుల తవ్వకం వాటి సరఫరా విషయంలో ప్రైవేటు వ్యక్తులకు కూడా సమాన అవకాశాలు కల్పించేవారు. అలా అయితేనే దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని చంద్రగుప్తుడి ప్రభుత్వం భావించింది. విద్య, కళలకు మౌర్యుల కాలంలో ఆదరణ ఉండేది. ఇంతటి మహా సామ్రాజ్యానికి అధిపతి అయిన చంద్రగుప్తుని…చాణిక్యుడు కంటికి రెప్పలా కాపాడుకునే వాడు. రాజ భవనం చుట్టూ లోపల కట్టుదిట్టమైన భద్రత ఉన్న శత్రువు దాడులు జరిగే అవకాశం ఉందని భావించి తరచూ చంద్రగుప్తుడి పడక గదులను మారుస్తూ ఉండేవాడు. చాణక్యుడి సూచనమేరకు దర్బార్ కు, వేటకు, ఏవైనా ముఖ్య పండగలకు తప్ప చంద్రగుప్తుడు రాజభవనం దాటి బయటకు వచ్చేవాడు కాదు.
ఇక చంద్రగుప్తుడు వేటకి వెళ్ళినప్పుడు అతని చుట్టూ రక్షణగా మహిళా సైనికులు ఉండేవారట. రాజు పై కుట్ర దాడికి పాల్పడటం లాంటి మొదలైన విషయాలలో మహిళా సైనికులు నుంచి ముప్పు తక్కువగా ఉంటుంది అని భావించి చాణిక్యుడు ఈ ఏర్పాటు చేశారట.
Leave a Comment