Meeku Telusa

Chanakya 3 | బిందుసార ఎవరు ఆ పేరు ఎలా వచ్చింది

కౌలుట రాజ్యానికి చెందిన చిరవర్మన్, పరాశిఖ కు చెందిన మెగాక్ష, మలయకి చెందిన నరసింహ, కాశ్మీర్ కి చెందిన పుష్కరాంశ, సయిందవ కి చెందిన సింధు జనాలతో మాల్యకేతు, రాక్షసులు కూటమి ఏర్పాటు చేశారు. ఈ కూటమిలో చెడి, గాంధార, గుణ, ఘాస, మగధ, శఖ, యావణ రాజ్యాలకు చెందిన కొందరు సైనికులు కూడా అండగా నిలిచారు. చాణిక్య ,చంద్రగుప్త లపై ప్రతీకారం తీర్చుకునేందుకు మాల్యకేతు, రాక్షసుల ద్వయం ఈ మేరకు సన్నాహాలు చేసుకుంటోంది.

ఇదిలా ఉండగా రాక్షసుడికి చెందిన ముగ్గురు గూఢచారులు జీవ సిద్ధి , శకట దాస, చందన దాసలు పాతలిపుత్ర లో ఉన్నట్లు చాణిక్యుడి కి సమాచారం అందుతుంది. అయితే ఈ ముగ్గురు గూడచారులలో జీవ సిద్ద అనేవాడు నిజానికి చాణిక్యుడు నియమించిన గూడచారి. రాక్షస వద్దకు చేరి అతని నమ్మకాన్ని పొంది అతనికి కీలక గూఢచారుల్లో ఒకడిగా జీవ సిద్ద ఎదిగాడు. రాక్షస కదలికలు, ఎత్తుగడలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని చాణక్యుడికి చేరవేస్తూ ఉంటాడు.మరో గూడచారి చందన దాస రాక్షసకు అత్యంత ఆప్తుడు

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

ఇక చాణిక్యుడు నియమించిన జీవ సిద్ధ… చందన దాసకి తెలియకుండా అతని నుంచి రాక్షసుడికి చెందిన రాజముద్ర ఉన్న ఉంగరాన్ని దొంగిలించి చాణక్యుడికి ఇస్తాడు.

ఇప్పుడు చాణిక్యుడి ప్రధాన లక్ష్యం రాక్షస, మాల్య కేతుల మైత్రిని బంగపరచడం.. ఇందుకోసం ముందుగా రాక్షస గూడచారి లో ఒకరైన శకట దాస హత్యకు చాణిక్యుడు ప్లాన్ చేస్తాడు

శకట దాసను… చందన దాసు దగ్గర గూఢచారిగా పని చేసే సిధార్థక రక్షిస్తాడు… దీంతో చాణిక్యుడి పధకం ఫలించింది. చాణిక్యుడు అతని చంపాలనుకున్నాడు కదా మరి ఇప్పుడు అతని పథకం విఫలమైతే ఫలించింది అంటున్నారని అనుకుంటున్నారేమో

నిజానికి ఈ చాణిక్యుడి పథకం శకట దాసుని చంపడం కాదు. శకట దాస ద్వారా రాక్షస దగ్గరికి తన గూడచారి ని పంపించడం. అందుకే హత్యాయత్నం చేయించి చందన దాస దగ్గర పనిచేస్తున్న తన గూడచారి సిద్ధార్థక చేత రక్షించి సిద్ధార్థక తమవాడు అని నమ్మకం కుదిరేలా చేస్తాడు. దీంతో శకట దాస సిద్ధార్థను రాక్షస దగ్గరికి తీసుకు వెళ్తాడు. తనను చాణిక్యుడి కుట్ర నుంచి రచించింది ఇతనే అని శకట దాస సిధార్థక ను రాక్షసకు పరిచయం చేస్తాడు

చాణిక్యుడు చందన దాసు నుంచి సంపాదించి తనకు ఇచ్చిన ఉంగరాన్ని రాక్షసకి చూపిస్తాడు. దీంతో సిద్ధార్థక తన మిత్రుడు చందన దాస మనిషేనని రాక్షస నమ్ముతాడు. ఇక అప్పట్నుంచి చాణిక్యుడు రాక్షస పై నిఘా పెంచుతాడు

ఇప్పుడు చాణిక్యుడి తదుపరి లక్ష్యం రాక్షస, మాల్యకేతుల మైత్రిని తుంచడం.. ఇందుకోసం రాక్షస ఎత్తుగడే వాడుకుంటాడు.. ఓసారి సంగీత విద్వాంసుల వేషంలో రాక్షస గూఢచర్యులు చంద్రగుప్తుడి దర్బార్ వస్తారు.. ఈ విషయం తెలిసిన చాణిక్యుడు చంద్రగుప్తుడు వారి ముందు వాగ్వాదానికి దిగినట్టు నటిస్తాడు. ఈ క్రమంలో చంద్రగుప్తుడు… చాణిక్యుడిని మంత్రిగా తొలగిస్తున్నట్లు ఆదేశిస్తూ రాక్షసుడే.. చాణిక్యుడి కన్నా మెరుగైన మంత్రి అని చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉండగా మాల్యకేతు వద్ద స్నేహితుడిగా ఉంటున్న చాణిక్య గూడచారి బగురాయన.. రాక్షస పై మాల్యకేతుకు సదాభిప్రాయం పోయేలా చేసేందుకు ప్రయత్నిస్తాడు. రాక్షసకి చాణిక్యుడు మాత్రమే శత్రువని చంద్రగుప్తుడు కాదని అంటాడు. ఇలా వీరు మాట్లాడుకుంటూ రాక్షస నివాసానికి చేరుకునేసరికి.. అప్పటికే చంద్రగుప్తుడి దర్బార్ నుంచి తిరిగి వచ్చిన గూఢచారులు రాక్షసకి జరిగిందంతా చెప్పారు

చాణక్యుని చంద్రగుప్తుడు మంత్రిగా తొలగించాడని, రాక్షస పై ప్రశంసలు కురిపించాడు అని వివరిస్తారు. ఈ మాటలు విన్న మాల్యకేతుకు రాక్షస పై అనుమానం బలపడింది. దీనితో మాల్యకేతు రాక్షసుడు సాయం లేకుండా సొంతంగానే పాటలీపుత్ర పైకి దండెత్తి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు

యుద్ధానికి సన్నద్ధమయ్యేందుకు మంచి ముహూర్తం ఎప్పుడు అని జైన సాధువు జీవ సిద్ధిని మాల్యకేతు సలహా కోరాడు. చాణిక్యుడి గూడచారి అయినా జీవసిద్ధి, వెంటనే బయలుదేరమని ఇప్పుడు మంచి ముహూర్తం ఉందని చెప్పాడు అంతటితో ఆగకుండా మాల్యకేతు తండ్రి పర్వతుడు చావుకు కారణం రాక్షసుడే అని నమ్మబలుకుతాడు. పక్కనే ఉన్న బగురాయన ఇప్పుడు ఏమీ చెయ్యొద్దని సముదాయిస్తాడు…

ఇక అప్పుడే చాణిక్యుడి మరో గూడచారి రాక్షస మనుషుల్లో ఒకడిగా లోకాన్ని నమ్మ బలికించిన సిద్ధంతక.. చాణిక్యుడి పథకంలో భాగంగా మాల్యకేతుకు పట్టుబడతాడు రాక్షస నుంచి చంద్రగుప్తునికి రాసినట్లుగా రాక్షస రాజ్య ముద్రతో ఓ దొంగ లేఖను సృష్టిస్తాడు

ప్రధానమంత్రిగా చాణిక్య స్థానాన్ని భర్తీ చేయడమే నా లక్ష్యం… మీతో ఎలాంటి వైరం లేదు.. మాల్యకేతు మరో ఐదు మిత్ర పక్షాలతో కలిసి భూమి, సంపద కోసం పాతలిపుత్ర మీదకు దండెత్తలని ప్రణాళికలు రచిస్తున్నాడు అని ఆ లేఖలో ఉంది. ఆ లేఖ నిజంగా రాక్షసుడు రాసాడు అని నమ్మిన మాల్యకేతు ఆగ్రహం తో ఊగిపోతాడు.. రాక్షసుడు సమావేశం ఏర్పాటు చేస్తాడు

ఆ సభకు రాక్షస గతంలో తనకు చాణిక్యుడి గూడచారి వర్తకుడి వేషంలో అమ్మిన పర్వతకుడి ఆభరణాలను ధరించి వస్తాడు. అవి పర్వతుడి ఆభరణాలు అనే విషయం రాక్షసకి తెలియదు. రాక్షస తన తండ్రి ఆభరణాలు ధరించి రావడం గమనించిన మాల్యా కేతువు తన అనుమానం నిజమే నని నిర్ణయించుకుంటాడు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న మాల్యకేతు రాక్షసుడితో సహా పాటలీపుత్ర పై దండెత్తి ఎందుకు తనతో చేతులు కలిపిన మిత్రపక్షాల పై దాడికి దిగుతాడు. ఈ క్రమంలో ఐదుగురు హతం కాగా రాక్షస అక్కడినుంచి పారిపోతాడు. ఇక పరారీలో ఉన్న రాక్షసను చాణిక్య గూఢచారులు వెంబడించారు

ఈ క్రమంలో ఒక గూడచారి చందనదాసకు అత్యంత సన్నిహితుడని రాక్షసను నమ్మిస్తాడు. చందన దాస ప్రాణాలకు ముప్పు ఉందని రాక్షస ఆచూకీ చెప్పినందుకు అతడికి మరణశిక్ష విధించాలని త్వరలోనే అది అమలు కానుందని చెప్పాడు. తన ప్రాణ స్నేహితుడికి మరణదండన పనుంది అనే మాట విని కంగారుపడ్డ రాక్షస…లొంగి పోయేందుకు సిద్దపడి పాటలీపుత్ర చేరుకుంటాడు.. స్నేహితుల పట్ల రాక్షసకు ఉన్న విధేయతకు మెచ్చిన చాణిక్యుడు అతడికి క్షమాభిక్ష పెడతాడు. బందీలుగా మాల్యకేతు, చందనదాస లను విడుదల చేస్తే ప్రధానమంత్రిగా సేవలు అందించేందుకు సిద్ధమని చేసిన విజ్ఞప్తికి చాణక్యుడు, చంద్రగుప్తుడు అంగీకరిస్తారు.

ఇలా చంద్రగుప్తుని రాజు చేయడమే కాక రాజ్యం లో స్థిరత్వం నెలకొల్పడం తో తన లక్ష్యాలు సాధించిన చాణక్యుడు తన శిఖ ను ముడి వేస్తాడు

ఇలా రాజ్యం లో పాలన ప్రశాంతంగా సాగుతున్న టైంలో అకస్మాత్తుగా చంద్రగుప్తుడి భార్య దుర్దర పైన విషప్రయోగం జరగడంతో రాజ్యంలో కలకలం మొదలవుతుంది.

ఆమెపై విషప్రయోగం జరగడానికి ఓ రకంగా చాణిక్యుడు కారణం. సదా రాజ క్షేమం కోరే చాణిక్యుడు చంద్రగుప్తుడి శరీరం విషప్రయోగం సైతం తట్టుకునే విధంగా తయారు చేయాలని అనుకున్నాడు. అందుకే చంద్రగుప్తునికి శిక్షణ ఇచ్చే కాలం నుంచి అతనికి తెలియకుండా అతని ఆహారంలో అత్యంత సూక్ష్మమైన మోతాదులో విషం కలిపేవాడు.. ఈ విషయం తెలియని చంద్రగుప్తుడు ఓసారి గర్భవతి అయిన భార్య, తనతో కలిసి భోజనం చేస్తూ ఉన్న సమయంలో ప్రేమతో తన పళ్ళెంలోని ఆహారాన్ని ఆమెకు తినిపించాడు. అది విషపూరితమైన ఆహారం కావడంతో ఆమె అస్వస్థతకు గురై నేలకూలింది. విషయం తెలుసుకున్న చాణిక్య పరుగుపరుగున అక్కడికి చేరుకుంటాడు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో కడుపులోని బిడ్డను కాపాడాలని నిశ్చయించుకుంటాడు. వెంటనే ఆమె గర్భం కోసి బిడ్డను వెలికి తీస్తాడు. ఆ బిడ్డకి బిందుసార అని పేరు పెడతాడు. చాణిక్యుడు ఆ బిడ్డకి బిందుసార అనే ఈ పేరు పెట్టడం వెనుక భిన్న వాదనలు ఉన్నాయి

కడుపులో ఉన్న బిడ్డ తలని అప్పటికే తల్లి శరీరంలోకి వెళ్లిన ఓ విషపు చుక్క తాకిందని.. అందుకే చాణిక్యుడు ఆ శిశువుకు బిందుసార అని పేరు పెట్టాడని జైన్ చరిత్రకారులు చెబుతున్నారు. మరోవైపు బౌద్ధులు రచించిన మహా వంశంలో మాత్రం బిడ్డను తల్లి గర్భం నుంచి వెలికి తీయగానే ఆ శిశువును రక్షించేందుకు ఏడు రోజుల పాటు రోజుకు ఒక మేకను చంపి ఆ మేక కడుపులో బిడ్డను భద్రపరిచే వాళ్ళని అలా క్రమంగా ఆ శిశువు కొలుకున్నదని అంటారు. అయితే ఆ శిశువు మేక కడుపులో ఉన్నప్పుడు ఆ మేక రక్తపు బొట్లు పడటంతో శిశువు శరీరంపై పలుచోట్ల మచ్చలు ఏర్పడ్డాయని అందుకే ఆ బిడ్డకు బిందుసార అని చాణిక్యుడు పేరు పెట్టాడని చరిత్రకారులు చెబుతున్నారు.

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!