పానిపూరి అందులో ఉన్న పాని ని పక్కనబెడితే…ఈ పేరు వినగానే మీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా అందులోనూ వర్షాకాలం ఈ చల్లని వాతావరణంలో వేడి వేడిగా పాణిపూరి తింటే…ఆహా.. ఆ మాజానే వేరుగా ఉంటుంది. పానీపూరి ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి. మనమే కాదు ఈరోజు గూగుల్ కూడా పానీపూరి ని సెలబ్రేట్ చేసుకుంటూ ఒక కొత్త గేమ్ తీసుకొచ్చింది.
అసలు ఇంత మంది దగ్గర మార్కులు కొట్టేసిన ఆ పానీపూరి మొదటిసారి తయారు చేసింది ఎవరో తెలుసా? పదండి తెలుసుకుందాం..
పాని పూరి గురించి చారిత్రక పౌరాణిక కథనాలు ఉన్నాయి..
ఒక కథ ప్రకారం ద్రౌపది పాండవుల ను పెళ్లి చేసుకొని వచ్చిన కొత్తలో కుంతీదేవి తన కోడలికి ఒక పరీక్ష పెట్టిందట. మిగిలిపోయిన బంగాళాదుంపలు, కొద్దిగా గోధుమపిండి ఇచ్చి తన ఐదుగురు కుమారులు ఆకలి తీర్చేలా వంట చేయమని చెప్పిందట… అప్పుడే ద్రౌపది తొలిసారిగా పానీపూరి చేసింది.. పాండవులు అయిదుగురు ఆ పానీపూరి ని చాలా ఇష్టంగా తిన్నారట. అందుకు సంతోషించిన కుంతీదేవి ఆ పానీ పూరీకి అమరత్వం ప్రసాదించిందట.
కొందరు చరిత్రకారులు మాత్రం పానీపూరి ని తొలిసారి మగధ సామ్రాజ్యంలో తయారు చేశారని చెబుతారు వేరే విషయం అనుకోండి కానీ దాన్ని తయారు చేసిన వ్యక్తి పేరు మాత్రం చరిత్రలో లేదు. పానీపూరి గురించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ వాటికి సరైన ఆధారాలు కూడా లేవు
పానీ పూరి ని ఎప్పుడు ఎక్కడ ఎవరు కనిపెట్టారో తెలియదుగానీ ఇప్పటికీ ఇంత మంచి పానీపూరిని ఇచ్చిన వారికి మాత్రం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పూరి పవిత్రం… ఆ పాని పవిత్రం… పానీపూరి చేసే వాడు ఇంకా పవిత్రం… మరి మీ ఫేవరెట్ పానిపురి స్పాట్ ఏంటో కామెంట్ చేయండి
Leave a Comment