Self Employment

Business Idea : ట్రేస్ మేకింగ్ బిజినెస్ తో ఊహించని ఆదాయం

ఫ్రెండ్స్ సహజంగా మార్కెట్లో మనం కొనుగోలు చేసే ఉత్పత్తులకు ఎంత డిమాండ్ ఉంటుందో.. వాటిని రవాణా చేసేందుకు వాడే ఐటమ్స్ కు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. వస్తువుల రవాణాలో ఈ ఐటమ్స్ ఎంతో ముఖ్యం కాబట్టి ఇలాంటి వాటితో మనం బిజినెస్ చేసినట్లయితే చక్కటి స్వయం ఉపాధి పొందవచ్చు. ఇలాంటి బిజినెస్ లకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి మార్కెటింగ్ కోసం పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. ఆ బిజినెస్ ఏంటి అంటే ట్రేస్ మేకింగ్ బిజినెస్.

సహజంగా గుడ్లను గాని, పండ్లను గాని లేదా ఏదైనా పగిలిపోయే ఐటమ్స్ ని రవాణా చేసే సమయంలో వాటికి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉండేందుకు అట్ట ట్రేస్ ను వాడుతారు. వీటి వాడకం ఎప్పుడు ఉంటుంది కాబట్టి డిమాండ్ అనేది అస్సలు తగ్గదు. కాబట్టి వీటి తయారీనే మనం బిజినెస్ గా ఎంచుకొని చక్కటి ఉపాధిని పొందవచ్చు. ఇక ఈ బిజినెస్ ను స్టార్ట్ చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఏమేం మిషన్లు కావాలి, లాభాలు ఎంతవరకు ఉంటాయి ఇలాంటి ఈ బిజినెస్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ బిజినెస్ ప్రారంభించడానికి మనకి రెండు రకాల మిషనరీ అనేది అవసరం అవుతుంది. అవి గ్రైండింగ్ మిషన్ మరియు ట్రేస్ మౌల్డింగ్ మిషన్. ట్రేస్ మోల్డింగ్ మిషన్ అనేది మనకు రెండు లక్షల రూపాయలకు లభిస్తుంది. అదేవిధంగా గ్రైండింగ్ మిషన్ అనేది మనకు పరిమాణాన్ని బట్టి 50 వేల వరకు ఉంటుంది. ఇక రా మెటీరియల్ కింద వేస్ట్ పేపర్స్ ను వాడుతారు.

ఇక తయారీ విధానం ఒకసారి చూసుకున్నట్లయితే ముందుగా గ్రైండింగ్ మిషన్ లో వేస్ట్ పేపర్ లను వేసి వాటర్ ను పోయాలి. దీన్ని పల్పింగ్ అని అంటారు. తరువాత గ్రైండర్ ను ఆన్ చేసుకుని పేస్టు రూపం వచ్చేలా చేసుకోవాలి. మౌల్డింగ్ మిషన్ ను ఉపయోగించి మనకి నచ్చిన రూపంలో ట్రేస్ ను తయారు చేసుకోవాలి. ఈ తయారీ విధానం అనేది మిషన్ సప్లయర్స్ దగ్గర నేర్చుకోవచ్చు. ఈ ట్రేస్ ఎలా తయారు చేస్తారు అనే విషయం పైన పిడిఎఫ్ ఈ విసియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అది డౌన్లోడ్ చేసుకుని ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు.

ఈ బిజినెస్ లో ఖర్చులు, లాభాల వివరాలను ఒకసారి చూసుకున్నట్లయితే ఒక ట్రే తయారీకి రెండు రూపాయల ఖర్చు అవుతుంది. దీనిపై మనం ఒక రూపాయి లాభం వేసుకుని మూడు రూపాయలు హోల్సేల్ ధరలకు అమ్మవచ్చు. రోజుకు కనీసం మూడు వేల ట్రేస్ ను సేల్ చేసినట్లయితే మూడువేల రూపాయలు లాభం అనేది వస్తుంది. ఇలా నెలకు 90 వేల రూపాయలు సంపాదించవచ్చు.

ఇక ట్రేస్ మార్కెటింగ్ కొరకు మనం ఎగ్ సప్లయర్స్, ఫ్రూట్ సప్లయర్స్ ను సంప్రదించాలి. వారికి మన ప్రొడక్ట్ ను తక్కువ ధరకు అందించే విధంగా ఒప్పందం కుదుర్చుకోవాలి. తద్వారా ఈ బిజినెస్ కు మార్కెటింగ్ అనేది సులభతరం అవుతుంది.

సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి బిజినెస్ ఐడియా, ఇటువంటి బిజినెస్ ను ప్రారంభించే ముందు పూర్తి అవగాహన పొందవలసింది, మార్కెటింగ్ గురించి అన్ని విషయాలు తెలుసుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇందులో మంచి లాభాలు సంపాదించుకోవాలని కోరుకుంటూ మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మల్లి కలుద్దాం అంతవరకూ సెలవు నమస్కారం.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!