హిందూ సాంప్రదాయాలు ఏ మంచి పని ప్రారంభించాలన్నా ముందుగా తిధిని చూస్తారు. ఏకాదశి తిథి ఉంటే చాలు పనిని ప్రారంభిస్తారు. ఒక సంవత్సరం లో ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. హిందువులు దీన్నే తొలి ఏకాదశి గా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం ఆషాడ మాసం లో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజు శ్రీ మహా విష్ణువు యోగ నిద్ర లోకి వెళ్తాడు. స్వామి నిద్రకుపక్రమించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజు యోగనిద్రలోకి వెళ్ళే స్వామివారు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. నాలుగు నెలల కాలాన్ని చతుర్ మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.
తొలి ఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు అంటే ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి భోజనం చేస్తే జన్మజన్మల పాపాలను ప్రక్షాళన అవుతాయని భక్తుల నమ్మకం. కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను ఋషులను హింసించే వాడుఅని మరో కథ ఉంది. శ్రీ మహా విష్ణువు ఆ రాక్షసుడితో వెయ్యేళ్లు పోరాడి అలసిపోయే గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరంనుంచి ఓ యోగమాయ ఆవిర్భవించింది అది ఆ రాక్షసిని అంతం చేసిందట. మహా విష్ణువు యోగ మాయను ఏకాదశిగా అనుగ్రహించాడు అని చెబుతారు
ఏకాదశి అంటే పదకొండు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు + అయిదు కర్మేంద్రియాలు + ఒక్క మనస్సు అన్నీ కలిపితే 11. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి అన్నిటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి. సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని చెబుతారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ అత్యంత పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు. సన్యాసం తీసుకున్న వారు మాత్రమే
ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలలపాటు ప్రయాణాలు చేయరు, కామక్రోధాలను వదిలిపెడతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వస్తాయి శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి. వాతం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమైన శరీరం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనూ ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. సాంప్రదాయం తో కేవలం భక్తి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ఎంతో చక్కగా ఉంటుంది. ఇది తొలి ఏకాదశి ఏకాదశి ఉపవాసం వెనకున్న కథ.
Leave a Comment