Self Employment

Nippi Franchise Business | తక్కువ పెట్టుబడితో ఫ్రాంచైజీ, రూము రెంట్, జీతం కంపెనీ ఇస్తుంది

తక్కువ పెట్టుబడితో మీ ఊర్లోనే ఉంటూ మంచి ఆదాయం సంపాదించుకునే ఒకే బెస్ట్ ఫ్రాంచైజ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. మార్కెట్లో అనేక కంపెనీలు ఫ్రాంచైజీలను అఫర్ చేస్తున్నాయి కదా ఇదే బెస్ట్ అని ఎందుకు అనుకోవాలి అనే సందేహం మీకు రావచ్చు. అనేక కంపెనీలు ఫ్రాంచైజీలు అఫర్ చేసిన అవి కేవలం ప్రాడక్ట్ సెల్ పైన కమీషన్ మాత్రమే ఇస్తాయి. కానీ ఇప్పుడు తెలుసుకోబోయే ఫ్రాంచైజీ వాళ్ళు మీకు ప్రాడక్ట్ సెల్ పైన 15% మార్జిన్ ఇవ్వడంతోపాటు మీకు షాపు రెంట్ 10,000 అలాగే డెలివరీ బాయ్ జీతం క్రింద 15,000 ప్రతి నెల ఇస్తారు. అందుకే ఇది బెస్ట్ ఫ్రాంచైజీ. ఆ ఫ్రాంచైజీ ఏంటి అంటే నిప్పి ప్రాడక్ట్స్ ఫ్రాంచైజీ.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలలో ఈ కంపెనీ స్టోర్ లు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇప్పుడు కంపెనీవారు ఆల్ ఓవర్ ఇండియా లో ఫ్రాంచైజీ లను అఫర్ చేస్తున్నారు. ప్రతి ఐదు కిలోమీటర్ లకు ఒక స్టోర్ ఇస్త్తున్నారు. నిప్పి కంపెనీ వారు అందిస్తున్న ఈ ఫ్రాంచైజీ తీసుకోవాలి అంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, కంపెనీవారు ఎలాంటి సపోర్ట్ అందిస్తారు, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

RSS Error: A feed could not be found at `http://www.tejajobs.com/?#`. This does not appear to be a valid RSS or Atom feed.

మన దేశంలో ఆన్లైన్ డెలివరీ వ్యాపారం చాల బాగా జరుగుతోంది. కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ తమకు ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెడుతున్నారు. అయితే తమకు అవసరమైన ఒక్కో ప్రోడక్ట్ కు ఒక్కో అప్ ను తమ ఫోన్ లో ఇంస్టాల్ చేసుకోవలసి వస్తోంది. అంటే ఫుడ్ కావాలంటే స్విగ్గి, జొమాటో, మొబైల్ యాక్సెసరీస్ కావాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, పాలు కావాలంటే ఒక అప్, గ్రోసరీ ఐటమ్స్ కావాలంటే మరొక అప్ ఇలా మొబైల్ మొత్తం అప్ లతో నిండిపోతోంది. అయితే ఇప్పుడు ఇలాంటి కష్టం ఏమి అవసరం లేకుండా గ్రోసరీ ఐటమ్స్ , ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, హోమ్ అప్పీరియన్స్, మొబైల్ యాక్సెసరీస్ , డైలీ ప్రోడక్ట్స్ , ఫార్మసీ ఇలా ఏంకావాలన్న ఒకే అప్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. అదే నిప్పి మొబైల్ అప్ ., ఇది ఒక ఆన్లైన్ డెలివరీ అప్. ఈ అప్ లో మనం చూసినట్లయితే ఫార్మసీ, మీట్, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్, పాన్ షాప్ , బేకరీ ఐటమ్స్ , ఫ్రూప్ట్స్, వెజిటబుల్స్, హోమ్ నీడ్స్ , గ్రోసరీ, డైలీ ప్రాడక్ట్స్ కి సంబందించిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అన్ని రకాల ప్రాడక్ట్స్ ఇందులో ఉంటాయి. 

తెలుగు రాష్ట్రాల్లో నిప్పి సంస్థ కొన్ని వందల హోమ్ ఆప్పీరియన్స్ , మొబైల్ యాక్ససరీస్ , ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నుండి డైరెక్ట్ గ కొని మార్కెట్ ధరకన్నా చాల తక్కువకు మంచి క్వాలిటీ తో అందిస్తున్నారు.

ఈ కంపెనీ వారు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాగా ఈ కంపెనీ స్టోర్ లను నెలకొల్పేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ స్టోర్ కి సంబంధించి ఫ్రాంచైజీ తీసుకోవాలి అనుకునేవారు కంపెనీవారికి లక్షరూపాయల సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది. దీనికి గాను కంపెనీవారు కొన్ని రన్నింగ్ మరియు మూవబుల్ ఐటమ్స్ ను ఫ్రాంచైజీ తీసుకున్నవారికి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ స్టాక్ మెయింటైన్ చేయాలి అంటే 10 నుండి 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి కాబట్టి అంత పెట్టుబడి అంటే అందరు మెయింటైన్ చేయలేరు కాబట్టి తక్కువ బడ్జెట్ లోనే రన్నింగ్ ఐటమ్స్ మాత్రమే ఫ్రాంచైజీ వారికీ అందిస్తున్నారు. ఈ ఫ్రాంచైజీ తీసుకున్నవారికి కంపెనీవారు ఇచ్చే స్టాక్ డిస్ప్లే చేయడానికి ఒక రూమ్ అవసరం ఉంటుంది.

మీరు మీ పట్టణంలో మంచి రద్దీగా ఉన్న ప్రదేశంలో రూమ్ రెంట్ కు తీసుకుంటే కంపెనీ వారు రూమ్ రెంట్ క్రింద మీకు 10000 రూపాయలు చెల్లిస్తారు, కస్టమర్ లు ఎవరైనా ఆర్డర్ బుక్ చేసుకుంటే మీ ఏరియాలో ఉన్న ఐదు కిలోమీటర్ల సరౌండింగ్ లో డెలివరీ ఇవ్వవలసి ఉంటుంది. అంటే మీరు ఎవరైనా డెలివరీ బాయ్ ని నియమించుకోవాలి . ఆ డెలివరీ బాయ్ కి కూడా సాలరీ క్రింద 15,000 రూపాయలు ఇస్తారు. అంటే షాప్ రెంట్ క్రింద 10,000 రూపాయలు డెలివరీ బాయ్ జీతం క్రింద 15,000 రూపాయలు మొత్తం నెలకు 25,000 రూపాయలు కంపెనీ వారు ఫ్రాంచైజీ తీసుకున్నవారికి చెల్లిస్తారు. అంతేకాకుండా ప్రతి ప్రాడక్ట్ సెల్ పైన 15% మార్జిన్ కూడా ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడి మీకు మూడు నుండి 4 నెలల్లోనే తిరిగి వచ్చేస్తుంది.

సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ్టి బిజినెస్ ఐడియా .. మీరు కూడా మీ గ్రామంలో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటె ఈ క్రింద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని, అన్ని విషయాలు ఆలోచించుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇందులో మంచి లాభాలు సంపాదించుకోవాలని కోరుకుంటూ మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మల్లి కలుద్దాం అంతవరకూ సెలవు, నమస్కారం.

https://youtu.be/y1P9VlMdaaY

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!