Meeku Telusa

ఆచార్య కణధుడు: ఫాదర్ అఫ్ అటామిక్ థియరీ

ప్రాచీన భారత శాస్త్రవేత్తలు వైద్యం, అంతరిక్షం పై పరిశోధనలకు మాత్రమే పరిమితం కాలేదు. విజ్ఞాన శాస్త్రంలో ఆసక్తికర అంశాలు లో ఒకటైన అణు సిద్ధాంతం గురించి కూడా శతాబ్దాల క్రితమే తమ పరిశోధనలతో ఎన్నో విషయాలు తెలియపరిచారు. అలా కృషి చేసిన వారిలో ఒకరు మహర్షి కణధుడు.

అప్పట్లో విజ్ఞానానికి సంబంధించిన దర్శన శాస్త్రం లో సంఖ్య, మీమాంస, న్యాయ, వైశేషిక, యోగ భాగాలు ఉండేవి.

వైశేషిక భాగం అణువులు వాటి ప్రవర్తన మొదలైన విషయాలపై పరిశోధనకు సంబంధించింది. ఆచార్య కణధుడు ఇందులో ప్రావీణ్యం సంపాదించాడు. దీని కోసం ప్రత్యేకంగా ఓ విద్యా సంస్థను స్థాపించి విద్యార్థులకు అణువుల గురించి బోధించేవాడు. దీనిపై వైశేషిక సూత్ర పేరుతో గ్రంథం కూడా రాశాడు.

ఇందులో ద్రవ్య, గుణ, కర్మణ, సమయ, విశేష సమవయ అనే ఆరు అంశాలను పేర్కొన్నాడు. వీటిని పదార్ధాలుగా పేర్కొన్న కణధుడు విశ్వంలో ఏ విషయం గురించి వివరించాలి అన్నా ఈ ఆరు పదార్థాలు సరిపోతాయని చెప్పుకొచ్చాడు. ఈ వైశేషిక సూత్రంలోని 5 వ చాప్టర్ లో గ్రావిటీ గురించి, నిప్పు పైకి ఎందుకు లేస్తుంది, భూమిలో నుండి గడ్డి పైకి ఎలా ముగుస్తుంది, వర్షం కురిసే తీరు, పిడుగుపాటు, ద్రవపదార్థాలు మొదలైన విషయాలపై ఎంతో విజ్ఞానాన్ని పొందుపరిచాడు.

ఇక కణధుడు తన పరిశోధనల్లో బాగా ప్రసిద్ధి చెందిన అణు సిద్ధాంత విషయానికి వస్తే ఆటమ్స్ అంటే అణువులను విభజించొచ్చు కానీ వాటిని మరిన్ని సూక్ష్మ పదార్థాలు గా విభజించడం అసాధ్యమని కణధుడు పేర్కొన్నాడు. అణువులు నాలుగు రకాలుగా ఉంటాయని, ఈ అణువు చేతన, అచేతన స్థితిలో ఉంటాయని చెప్పుకొచ్చాడు. మరోవైపు అణువులను విభజించడం సాధ్యం కాదు అనేది 19వ శతాబ్దంలో దిగ్గజ శాస్త్రవేత్త Dalton ప్రతిపాదించిన అణు సిద్ధాంతం.

ఆ తర్వాత పరిశోధనల్లో అణువులను సూక్ష్మ పదార్థాలుగా విభజించవచని వాటిలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, ఉంటాయని తేలింది. కణధుడు కూడా తన పరిశోధనలో ఇదే విషయాన్ని చెప్పాడు.

అయితే ఈ ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు స్థానంలో పరమాణువులు అనే పదాన్ని ఉపయోగించాడు. కానీ కణధుడు చెప్పిన అణువు పరిమాణం నేటి శాస్త్రవేత్తలు పేర్కొంటున్న దానితో పోలిస్తే ఏడు వందల రెట్లు ఎక్కువ అని కొందరు పరిశోధకులు పేర్కొంటున్నారు. కణధుడు చెప్పిన అన్న సిద్ధాంతం ఇప్పటి లెక్కల తో పూర్తిగా సరిపోకపోయినా ఆ రోజుల్లో ఈ స్థాయిలో పరిశోధన చేపట్టడం ప్రతి భారతీయుడు గర్వించ దగ్గ విషయం

కణధుడు జీవించిన కాలం పై అంతగా స్పష్టత లేదు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో జీవించి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కనిష్కుడి వంశమైన కుషాణుల పాలనలో అంటే 1 లేదా 2 శతాబ్దాల మధ్య వచ్చిన మహా విభాస , జనన ప్రస్థాన, చరక సంహిత వంటి అనేక గ్రంధాలలో కణధుడి ప్రస్తావన ఉంది. అంతకుముందు వచ్చిన పలు గ్రంథాలలో కూడా ఈ ప్రస్తావన రావడంతో చరిత్రకారులు ఈ మేరకు అంచనా వేశారు.

కణధుడి ని కశ్యప, ములుక, కణంద, కణం అనే పేర్లతో కూడా పలు గ్రంథాలలో ప్రస్తావించారు. కణధుడికి ఈ పేరు రావడం వెనుక కొన్ని పరిశోధనలు, ఆసక్తికర కథలు చెప్పుకు వచ్చాయి. ఓ సందర్భంలో ప్రతి బియ్యపుగింజ ముఖ్యమైన ఆహారం విలువ చెప్పినప్పుడు ఆయన వివరించిన తీరు నచ్చి స్థానికులు ఆయనకు కనద అని పేరు పెట్టారట. సంస్కృతంలో కణ అంటే సూక్ష్మమైన అని అర్థం. అణువులు పై పరిశోధనలు చేస్తూ ఉండడం వల్ల ఆ పేరు వచ్చి ఉంటుందని మరికొందరు పేర్కొంటారు ఇది భారతావనిలో విజ్ఞాన అభివృద్ధికై అప్పట్లో తన వంతు పాత్ర పోషించిన కణధుడు కథ.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!