ఈ మధ్యకాలంలో ఉద్యోగం కోసం వెతుకున్నవారి కంటే వ్యాపారం చేయాలని చూసే వారి సంఖ్య పెరుగుతోందని ఓ అధ్యాయనంలో తేలింది. మనలో చాల మందికి వ్యాపారం చేయాలని ఆలోచన ఉన్నా.. ఎలాంటి బిజినెస్ చేయాలనేది కొన్నిసార్లు అర్థం కాదు. ఎందుకంటే ఏ వ్యాపారం కూడా అంత ఈజీగా మొదలు పెట్టడం సాధ్యం కాదు. కొన్ని వ్యాపారాలకు అనుభవం అవసరం.. మరిన్ని కొన్నింటికి ఆలోచన అవసరం. అందులోనూ సీజనల్ బిజినెస్ కాకుండా సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్ లలో అద్భుతంగా జరిగే బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో చాలా మంది సాధారణ వాటర్ కంటే మినరల్ వాటర్ తాగడానికి ఇష్టపడుతున్నారు. ఆ లెక్కన ఈ బిజినెస్ సంవత్సరం పొడవునా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించవచ్చు అన్నమాట. దానికి ప్రూఫ్ మన దేశంలో ప్రతి ఏటా ఈ మినరల్ వాటర్ వ్యాపారం 20 శాతం పెరుగుతోంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ మినరల్ వాటర్ ప్లాంట్ బిజినెస్ కేవలం ఎండాకాలంలోనే కాదు దీనికి అన్ని కాలాల్లోనూ డిమాండ్ ఉంటుంది.
ఈ బిజినెస్ కి మార్కెటింగ్ సమస్య కూడా ఉండదు. రిస్క్ కూడా చాల తక్కువ, సో ఈ వాటర్ ప్లాంట్ బిజినెస్ ఎలా మొదలుపెట్టాలి, ఎంత పెట్టుబడి అవసరమవుతుంది, ఎంత ఆదాయం వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.
ఈ బిజినెస్ లో పెట్టుబడి విషయానికి వస్తే వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు టీడీఎస్ స్థాయి అంటే నీటిలో ఘనపదార్థాలు ఎక్కువగా లేని ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అప్పుడే నాణ్యమై, స్వచ్ఛమైన వాటర్‌ని మీరు ప్రజలకు అందించవచ్చు. వాటర్ ప్లాంట్ కోసం బోరు ఆర్వో ప్లాంట్ తో పాటు ఇంకొంత మిషనరీ అవసరం అవుతుంది. చాలా కంపెనీలు కమర్షియల్ ఆర్ ఓ వాటర్ ప్లాంట్లను తయారుచేస్తున్నాయి. మార్కెట్లో వీటి ధర సుమారుగా రూ. 50,000 నుండి రూ. 2 లక్షల వరకు ఉంటుంది. దీనితో పాటు మీ ఏరియాలో ఉన్న డిమాండ్ ను బట్టి 20 లీటర్ల సామర్థ్యం ఉన్నవాటర్ క్యాన్‌లను కొనుగోలు చేయాలి. ఈ క్యాన్ ఒక్కొక్కటి 100 నుండి 150 రూపాయల మధ్యన లభిస్తుంది. వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు 1000 నుంచి 1500 చదరపు అడుగుల స్థలం కావాలి. ఆ స్థలాన్ని లీజుకు తీసుకుంటే దానికోసం అడ్వాన్స్, అద్దె, మిగిలిన సామగ్రి అన్ని ఖర్చులు కలిపి మొత్తంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంతేకాకుండా మీరు వాటర్ క్యాన్ లను డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆటో లను కూడా కొనుగోలు చేసుకోవాలి.
ఈ బిజినెస్ కి అవసరమైన లైసెన్స్ ల వివరాలు చూసినట్లయితే బయట చాల మంది జస్ట్ ఒక బోర్డు పెట్టి నడుపుతుంటారు. ఇలా చేయడం రిస్క్. చట్ట ప్రకారం నిర్వహిస్తేనే.. మన్ముందు ఎలాంటి సమస్యలు రావు. మీరు మినరల్ వాటర్ (Mineral water plant) వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే.. ముందుగా కంపెనీల చట్టం కింద దానిని నమోదు చేయాలి. పాన్ నంబర్, GSTనంబర్ వంటి అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేయండి. అధికార యంత్రాగం నుంచి లైసెన్స్, ISI నంబర్ తీసుకోవాలి.
గంటకు 1000 లీటర్ల నీటిని ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను నెలకొల్పితే గంటకు వెయ్యి లీటర్ల చొప్పున ఎనిమిది గంటలకు ఎనిమిది వేల లీటర్లు అంటే ఒక క్యాన్ కు 20 లీటర్ల చొప్పున 400 క్యాన్ లు అవుతాయి. మార్కెట్లో హోల్ సెల్ గా ఒక్కో క్యాన్ ధర 15 రూపాయలు వేసుకున్న 400 క్యాన్ లకు 6000 రూపాయలు వేస్తాయి. అంటే నెలకు దాదాపుగా 1,80,000/- ఆదాయం వస్తుంది. అందులో కరెంట్ బిల్, సిబ్బంది జీతం, ఇతర ఖర్చులు కనీసం లక్ష రూపాయల వరకు పోయినా… మిగిలిన 80,000/- మీ నికర లాభం అన్నమాట. ఎంత తక్కువగా బిజినెస్ జరిగేనా .. కనీసం రూ.30,000 నుంచి రూ.50,000 వరకు సులభంగా సంపాదించవచ్చు. కస్టమర్లు పెరిగేకొద్ది లాభం కూడా పెరుగుతుంది.
మినరల్ వాటర్ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్ అవసరం ఏమీ ఉండదు. మీరు ఏ ఏరియాలో ఈ బిజినెస్ మొదలుపెట్టినా ఆ ఏరియాలో చుట్టుపక్కల ఉండే ఇండ్లు, షాపులు, దుకాణాలు, హాస్పిటళ్లు, ఆఫీస్ లు, కంపెనీల నుంచి ఆర్డర్ లు రాబట్టుకోవడం ద్వారా ఈ బిజినెస్ లో ఎక్కువగా లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా నగరాల్లో నీటి సమస్య చాలా ఎక్కువ అందుకే డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఏరియాలలో వాటర్ బిజినెస్ చేస్తే పోటీ చాలా తక్కువగా ఉండడమే కాకుండా చాలా సులభంగా డబ్బులు సంపాదించుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ్టి బిజినెస్ ఐడియా… పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ వ్యాపారంలోకి దిగి వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లు అమ్మకాలతో కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నాయి. మరి మనం చిన్న స్థాయిలో మొదలుపెట్టి కనీసం వేలరూపాయలు అయినా సంపాదించలేమా..
ఏ బిజినెస్ అయినా అనుభవం లేకుండా ఆత్రంతో మొదలు పెడితే కష్టాలు ఎదురవుతాయి. ఏ బిజినెస్ అయినా మొదలు పెట్టబోయేముందు. ఈ బిజినెస్ గురించి మీకు తెలిసిన వారితో చర్చించి లాభనష్టాలు తెలుసుకుని కొంత అనుభవం సంపాదించుకున్న తరువాత మాత్రమే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇందులో మంచి లాభాలు సంపాదించుకోవాలని కోరుకుంటూ మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మల్లి కలుద్దాం అంతవరకూ సెలవు నమస్కారం.