Self Employment

Business Ideas Telugu || భవిష్యత్తు అంతా ఈ బిజినెస్ దే కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేయండి || నెలకు ఈజీగా రెండు లక్షలు

హాయ్ ఫ్రెండ్స్ రోజురోజుకీ ప్లాస్టిక్ ఉత్పత్తుల పై నిషేధం పెరుగుతున్నందున పేపర్ కు సంబంధించిన ఉత్పత్తులకు డిమాండ్ అనేది క్రమంగా వృద్ధి చెందుతూ వస్తుంది. ముంబైలాంటి మహానగరాల్లో ప్లాస్టిక్ అస్సలు కనిపించదు. ఎక్కడ చూసినా పేపర్ బ్యాగులే మన దగ్గర ఇంకా ఇంత స్థాయిలో పేపర్ బ్యాగుల వాడకం రాకపోయినా ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం కొంతమేర తగ్గిందని చెప్పవచ్చు. అంటే రాబోయేది పేపర్ బ్యాగుల రాజ్యమే.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే మనం కనుక పేపర్ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే మనం స్థిరమైన స్వయం ఉపాధిని పొందడానికి ఎంతో అవకాశం ఉంది. పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్ లాగానే మార్కెట్లో ప్రస్తుతం పేపర్ బ్యా గ్స్ కు కూడా మంచి డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, బట్టల షాపులలో ఈ పేపర్ బ్యాగ్ల వినియోగం చాలా ఎక్కువగా పెరిగింది. సో మీరు గనక పేపర్ బ్యాగు తయారీ వ్యాపారం మొదలుపెడితే చక్కటి ఉపాధి పొందవచ్చు.

ఇక విషయానికొస్తే ఈ బిజినెస్ ని ప్రారంభించడానికి మనకి పేపర్ బ్యాక్ మేకింగ్ మెషిన్ అనేది అవసరం అవుతుంది. ఈ మిషనరీలో ఆటోమెటిక్, సెమీ ఆటోమెటిక్ అని రెండు రకాలుంటాయి. సెమీ ఆటోమెటిక్ కు ఆటోమెటిక్ మిషన్ కు చాలా తేడా ఉంటుంది. సెమీ ఆటోమెటిక్ మిషిన్ ద్వారా నిముషానికి 60 పేపర్ బ్యాగులు తయారు చేస్తే, ఆటోమెటిక్ మెషీన్ ద్వారా నిముషానికి 100 పేపర్ బ్యాగ్స్ వరకు తయారు చేయవచ్చు. ఇక మిషనరీ రెండున్నర లక్షల నుండి 20 లక్షల వరకు వేరు వేరు ధరల్లో అందుబాటులో ఉంది. ఇంట్లో వాడే కరెంటుతో వాడచ్చు. ఆసక్తి కలిగిన వారు ఇండియా మార్ట్ వెబ్ సైట్ ను సందర్శించి ఈ మిషన్ ను కొనుగోలు చేయవచ్చు.
ఇక ఈ పేపర్ బ్యాగ్స్ తయారీ బిజినెస్ లో రా మెటీరియల్ కింద పేపర్ రోల్ ని వాడుతుంటారు. ఇది కూడా మనకు ఇండియన్ మార్ట్ వెబ్ సైట్లో లభ్యమవుతుంది. కేజీ పేపర్ రోల్ ధర మనకి 30 రూపాయల వరకు ఖరీదు చేస్తుంది. అంతేకాకుండా  కలర్, గమ్, థ్రెడ్ వంటి చిన్న చిన్న వస్తువులు కూడా కావాల్సి ఉంటుంది.
ఇక ఈ వ్యాపారంలో లాభాలు ఎలా ఉంటాయో ఒకసారి
ఒక్క పేపర్ బ్యాగ్ మామూలు సైజ్ ది తయారవ్వడానికి మూడు రూపాయల నుండి 3.20 పైసలు పడుతుంది. దీన్ని మీరు పది పైసల లాభం వేసుకుని అమ్మినా మీకు మంచి లాభాలు వస్తాయి. ఎలా అంటే సెమీ ఆటోమెటిక్ మిషన్ ప్రతి నిముషానికి 60 బ్యాగులు తయారు చేస్తుంది. ప్రతి బ్యాగుమీద ఖర్చులు పోను 10 పైసలు లాభం అనుకుంటే నిముషానికి ఆరు రూపాయల లెక్క వేసుకుంటే గంటకు 360 రూపాయలు. రోజుకు 8 గంటలకు పనిచేస్తే 2880రూ.లు లాభం. అలా నెలకు 25 రోజులు అంటే 72 వేల రూపాయలు లాభం పొందవచ్చు. అయితే మనం తయారు చేసే బ్యాగ్ సైజ్ ని బట్టి మార్కెటింగ్ చేసుకునే పరిధిని బట్టి మన ఆదాయం అనేది మారుతుంది. పేపర్ బ్యాగుల తయారీ బిజినెస్ కు గవర్నమెంట్ రిజిస్టేషన్ తప్పనిసరిగా కావాలి.
ఈ బిజినెస్ కి మార్కెటింగ్ అనేది కొంతమేర సులువనే చెప్పొచ్చు. రోజు రోజుకి ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గడం, పేపర్ బ్యాగ్ల వినియోగం పెరగడమే దీనికి కారణం. అంతే కాకుండా ఈ బిజినెస్ కి కొంత కాంపిటేషన్ కూడా తక్కువనే చెప్పాలి. ఆల్రెడీ  ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ కంటే మనం ఇంకొంచెం తగ్గించి ఈ బ్యాగ్లను అమ్మినట్లయితే మనకి ఆరంభంలో తక్కువ లాభాలు వచ్చినప్పటికీ మార్కెట్లో స్థిరపడడానికి అవకాశం ఉంది. మీ ఏరియా మొత్తాన్ని పేపర్ బ్యాగులకు అట్రాక్ట్ చేస్తే చాలు. దాంతో పాటు ఆన్ లైన్ సేల్ కూడా పెట్టుకోవచ్చు. బ్యాగు క్వాలిటీ, లుక్ ను బట్టి బ్యాగు రేటును పెంచుకోవచ్చు. దీంతో మంచి మార్కెట్ లాభాలూ వస్తాయి.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!