Self Employment

Business Ideas Telugu || రెండు రోజుల్లో కోట్ల సంపాదన ఉన్న బిజినెస్ మీరు ఓ లుక్కేయండి

దీపావళి పండగను చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఘనంగా జరుపుకుంటారు. దీపాలు వెలిగించి లక్ష్మి పూజ చేసి టపాసులు వెలిగిస్తారు…

దీపావళి అనగానే అందరికీ టపాసులు ఎలా గుర్తుకు వస్తాయో.. టపాసులు అనగానే శివకాశీ బాంబులు గుర్తుకు రావడం సహజం. ఈ శివకాశీ.. తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం. ప్రస్తుతం మనదేశంలో ఎక్కడికైనా టపాసులుఈ పట్టణం నుంచే సరఫరా చేస్తారు.

మన దేశంలో మొట్టమొదటి బాణాసంచా కర్మాగారం కోల్ కత్తాలో ప్రారంభమైంది. శివకాశీ పట్టణానికి చెందిన  పి.అయ్యన్ నాడర్, షణ్ముగ నాడర్ అనే ఇద్దరు అన్నదమ్ములు కలకత్తా వెళ్లి అక్కడ టపాసుల తయారీ కేంద్రంలో పనిచేశారు. అక్కడ వారు మొదట అగ్గిపెట్టెలు తయారు చేయడం నేర్చుకున్నారు. తర్వాత బాణాసంచా తయారీలో మెలకువలు నేర్చుకుని శివకాశికి తిరిగి వచ్చి 1923లో అగ్గిపెట్టెల పరిశ్రమ ప్రారంభించారు

తరువాత ఎనిమిది నెలలకు జర్మనీ నుంచి యంత్రాలను దిగుమతి చేసుకుని అనిల్ బ్రాండ్, అయ్యన్ బ్రాండ్ పేరుతో బాణాసంచా ఉత్పత్తిని ప్రారంభించారు. కాలక్రమానా కోల్ కత్తాలోని టపాసుల కేంద్రం శివకాశీకి తరలించారు. శివకాశీలో 8వేలకు  పైగా బాణాసంచా ఉత్పత్తి చేసే పరిశ్రమలున్నాయి. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే బాణాసంచాలో 90 శాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతుంటాయి.

ప్రతి సంవత్సరం కనీసం రూ.వెయ్యి కోట్ల బాణాసంచా వ్యాపారం ఇక్కడ జరుగుతుంది. అది కూడా కేవలం దీపావళి సమయంలోనే కావడం విశేషం. ప్రస్తుత రోజుల్లో దీపావళి పండగ సమయంలోనే కాకుండా వివాహాలు, ఫంక్షన్లు, ఎన్నికల సమయంలో కూడా టపాసులు కాలుస్తున్నారు. దీంతో సంవత్సరం పొడవునా ఇక్కడ టపాసుల కొనుగోళ్లు జరుగుతుంటాయి. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా టపాసులు తయారు చేసేది భారత్ లోనే. అందులోనూ శివకాశీ పట్టణంలోనే ఎక్కువ ఉత్పత్తి అవుతుంటాయి.

ఇక విషయానికి వస్తే దీపావళి పండుగ ఒకరోజు చేసుకుంటాం కానీ టపాసులు అనేవి సంవత్సరం మొత్తం జరిగే ఒక  లాభసాటి వ్యాపారం అని చెప్పవచ్చు ఎందుకంటే పెళ్లిళ్లు, ఊరేగింపులు, దేవి నవరాత్రులు, జాతరలు, ఇలా ఏ ఫెస్టివల్ వచ్చిన కచ్చితంగా ఈ టపాసులు కలుస్తుంటారు  టపాసులు ఎంత ఎక్కువగా పేలిస్తే  అంత  గొప్పగా చెప్పుకుంటారు.  అందుకే దీపావళి సమయం లోనే కాదు సంవత్సరం మొత్తం ఈ బిజినెస్ అనేది జరుగుతుంది. సో మీ ఊరిలో ఇలాంటి బిజినెస్ అనేది స్టార్ట్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించుకోవచ్చు

ఈ బిజినెస్ ని రెండు రకాలుగా చేయవచ్చు. ఒకటి హోల్ సెల్ బిజినెస్ రెండు రిటైల్ బిజినెస్ . హోల్ సెల్ గా ఈ బిజినెస్ స్టార్ట్ చేసే వారు తమిళనాడులోని శివకాశి వెళ్లి అక్కడనుండే ఈ టపాసులు కొనడం మంచిది. లేదా రిటైల్ గా మీ ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే లోకల్ గా ఉన్న డీలర్ ల వద్ద వీటిని కొనవచ్చు.

ఈ టపాసుల బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనం చాల రకాల పర్మిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం టీవీ లలో చూస్తూనే ఉంటాం ఇలా టపాసులు గోడౌన్ లలో నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఈ టపాసులు వ్యాపారం హోల్ సెల్ గా స్టార్ట్ చేయాలి అంటే మాత్రం ఉరికి దూరంగా ఒక షెడ్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ షెడ్ విస్తీర్ణం కూడా 150 నుండి 500 చదరపు అడుగుల స్థలం అయితే కావాల్సి ఉంటుంది.

ఈ బిజినెస్ కోసం కచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ కావాలి, జీఎస్టీ రిజిస్ట్రేషన్, ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతి కావాలి, అలాగే లోకల్ గ ఉన్న పోలీస్ వారి ఉంది కూడా పర్మిషన్ తీసుకోవాలి.

పెట్టుబడి విషయానికి వస్తే హోల్ సెల్ గా ఈ బిజినెస్ సార్ట్ చేయాలంటే మాత్రం కనీసం 30 నుండి 50 లక్షలు పెట్టుబడి అయితే పెట్టాలి రిటైల్ గా అయితే 5 లక్షల నుండి మీ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు.

ఆలా కాకుండా కేవలం దీపావళి రెండు రోజులు మీరు బిజినెస్ చేసుకోవడానికి అయితే ప్రతి పట్టణంలో మునిసిపల్ అధికారులు కేటాయించిన స్థలంలో ఒక షాపును తీసుకుని పండుగ రెండు రోజులు మీరు ఈ బిజినెస్ అయితే చేసుకోవచ్చు.

ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ విషయానికి వస్తే మీరు హోల్ సెల్ గా స్టార్ట్ చేస్తే మీకు నూటికి 50 రూపాయల వరకు ప్రాఫిట్ ఉంటుంది అదే రిటైల్ గా అమ్మకాలు జరిపితే నూటికి 200 రూపాయలు ప్రాఫిట్ అంటే డబుల్ ప్రాఫిట్ అన్నమాట ఇలా ఈ బిజినెస్ లో ఎంత లాభాలు ఉంటాయో అంతే రిస్క్ కూడా ఉంటుంది.

Address 1 : Sri balaji crackers , 3/547d,Andal nagar, Anuppan kulam post , Anuppankulam Sivakasi-626189 Address 2 : V sign fireworks , No-24/7,sivakasi bus stand , Sivakasi-626123 (Behind rsr petrol bank Near sivakasi bus stand) Address 3 : Pothis pyropark ,No-2/499B, Vimal fire works road , Sivakasi-626123 (Mettanalai) Address 4 : Shri vahini crackers, No-85, Vahini complex Gandhi road, Sivakasi-626123

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!