Meeku Telusa

మీరట్ లో అక్కడికెళ్లాలంటే ఎవ్వరికైనా భయమే..

అదో భయంకర ప్రదేశం.. ఆ ఇంట్లో ఎర్రటి వస్త్రాలు ధరించిన మహిళలు అరుస్తూ ఉంటారు. యువకులు బీర్ తాగుతూ ఉంటారు. ఇది అందరికీ ప్రతి రోజూ కనిపించే విషయమే. అయితే నిజం ఏంటంటే.. ఆ బంగ్లాలో ఎవ్వరు లేరు. మరి కనిపిస్తున్నవారంతా ఎవరయ్యుంటారనే దానిపై అన్వేషణ మొదలైంది. ఎవరికీ అందులోని నిజం తెలియలేదు. తెలుసుకోవాలనుకున్నవారంతా భయంతో ఉక్కిరిబిక్కిరై పోయి అటువైపు వెళ్లడమే మానేశారు. ఇంతటి భయానక ప్రదేశం గురించి మీరు తెలుసుకోండి.. ఇది చూసే ముందు ఓ గ్లాసు నీళ్లు మీ పక్కన పెట్టుకోవడం మర్చిపోవద్దు.

ఉత్తరప్రదేశ్లోని మీరట్ లో జిపి బ్లాక్ ను ఒక భయంకరమైన ప్రదేశంగా చెబుతుంటారు. చాలా సార్లు నలుగురు అబ్బాయిలు ఆ బ్లాక్ లో ఒక కొవ్వొత్తిని వెలిగించి బీర్ తాగుతున్నట్లు కనిపిస్తుంటారు. ఆ ఇంట్లో కూర్చొని వారు తాగడాన్ని చాలా మంది గమనించారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం గుండా వెళ్లాలంటేనే ప్రజలకు వణుకు పుట్టేది. ఎరుపు దుస్తులు ధరించిన బాలికలు కూడా ఇంటి నుంచి బయటకు వస్తున్నట్లు మరికొందరు గమనించినట్లు చెబుతారు. భవనం పైకప్పుపై కూర్చొని ఓ మహిళ అరుస్తూ ఉండటం, మరికొందరు ఇంటి చుట్టూ ఎర్రటి దుస్తులు ధరించి తిరగడాన్ని చూసి చాలా మంది భయపడి పోయారు. ఆ ఇంటి నుంచి అటువంటి ఘటనలు జరుగుతుండటం వల్ల చాలా మంది అటుగా వెళ్లడమే మానేశారు.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!