Self Employment

తెలుగు రాష్ట్రాలలో ఎవర్ గ్రీన్ బిజినెస్ ఒక్కసారి క్లిక్ అయితే వెనక్కి తిరిగి చూడక్కర్లేదు

ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో నిర్మాణ రంగం చాలా వేగంగా దూసుకు పోతోంది. ఈ మద్య కాలంలో ఉన్నత తరగతి వారు మాత్రమే కాకుండా మధ్య తరగతి వారు కూడా తమ ఇంటిని అందంగా ఉంచుకువడం కోసం ఇంటి ముందు పార్కింగ్ టైల్స్ ను వెయిస్తూ ఉంటారు. అందువల్ల ఈ పార్కింగ్ టైల్స్ కి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. కాబట్టి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల మంచి లాభాలు సంపాదించు కోవచ్చు.  

ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు ఒక సిమెంట్ రేకుల షెడ్డు లాంటిది ఏర్పాటు చేసుకోవాలి ఈ బిజినెస్ కోసం మనం కంస్ట్రక్టన్ పని చేసే కూలీలను నియమించుకోవచ్చు, మనం చేసే బిజినెస్ ని బట్టి వర్కర్స్ ని నియమించుకోవాలి.  అలాగే  రా మెటీరియల్ గా కాంక్రీటు డస్ట్ వాడతారు.మరియు బేబీ చిప్స్ అంటే సన్నని కంకర 8mm లావు ఉండాలి..ఇంకా సిమెంట్, పార్కింగ్ టైల్స్ మీద పూయడానికి కలర్ పొడర్ ను వాడుతారు. 

ఇక ఈ టైల్స్ తయారు చేయడానికి వివిధ సైజులు, వివిధ షేపులలో ఉండే మౌల్డ్స్ కావాలి…మీ ఏరియాలో ఏ డిజైన్ టైల్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంటే మొదట ఆ డిజైన్ తో స్టార్ట్ చేయండి.. మిషన్ ల విషయానికి వస్తే మనకు కాంక్రీటు మిక్సర్ మిషన్ మరియు ప్యాన్ మిక్సర్ మిషన్ లు కావాలి ఈ మిషన్ లు 1,20,000 నుండి 2 లక్షల వరకు ఉంటాయి కాంక్రీటు మిక్సర్ మిషన్ తో మనం కాంక్రీటు మిక్స్ చేసుకోవచ్చు అలాగే ప్యాన్ మిక్సర్ మిషన్ తో టైల్స్ కు కలర్ మిక్సింగ్ చేయడాని ఉపయోగిస్తారు మీరు చిన్నగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటె ఇది కొత్తది కాకుండా సెకండ్ హ్యాండ్ మిషన్ ల తో స్టార్ట్ చేయండి.  నెక్ట్స్ మనకు వైబ్రెటర్ మిషన్ కావాలి ఈ మిషన్ మనకు 29,000 నుండి మొదలవుతుంది.ఈ మిషన్ లను ఉపయోగించి మనం పార్కింగ్ టైల్స్ ను తయారు చేయవచ్చు. 

ఇక తయారీ విధానం చేసుకున్నట్లు అయితే మొదట 100 కేజీల కాంక్రీట్ డస్ట్ ను కాంక్రీట్ మిక్సర్ లో వేయాలి.ఆతరువాత 84 కేజీల బేబీ చిప్స్ అంటే 8,mm లావు ఉన్న కంకర వేసి అందులో 50 కేజీల సిమెంట్ వేసి వాటర్ పోస్తూ బాగా మిక్స్ చేయాలి.

ఆ తరువాత ప్యాన్ మిక్సర్ లో 50 కేజీల సిమెంట్ వేసి.మనం ఏ కలర్ పార్కింగ్ టైల్జ్ తయారు చేయాలి అనుకుంటున్నామో ఆ కలర్ పొడర్ 9 కేజీల వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.. ఇలా మిక్స్ చేసుకున్న పేస్టు ను మౌల్డ్ కు పూసి వాటిని వైబ్రేటింగ్ మిషన్ పైన పెట్టాలి ఇలా చేయడం వల్ల ఆ వైబ్రేషన్ కు ఆ కలర్ పేస్టు అనేది మౌల్డ్ అంతా సమానంగా సర్దుకుంటుంది..ఆ తరువాత కాంక్రీట్ మిక్సర్ లో మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ మౌల్డ్ లలో నీట్ గా పోసి మౌల్డ్ అంత FILL అయ్యేలా చూసుకోవాలి. ఈ వైబ్రేటింగ్ మిషన్ యొక్క వైబ్రేషన్ కు మౌల్డ్ లో టైల్స్ అనేది గ్యాప్ లేకుండా నీట్ గా తయారవుతుంది ఇలా తయారు చేసుకున్న వాటిని ఎండలో ఆర పెట్టాలి. ఈ విధంగా మనం పార్కింగ్ టైల్స్ అనేవి తయారు చేసుకోవచ్చు, ఇలా తయారు చేసుకున్న పార్కింగ్ టైల్స్ కి షైనింగ్ కోసం కలర్ కోటింగ్ వేసుకోవాలి, సో ఈ టైల్స్ ని మనం ప్యాకింగ్ బాక్స్ లలో ప్యాక్ చేసి సెల్ చేసుకోవచ్చు, ఈ బిజినెస్ కి మార్కెటింగ్ విషయానికి వస్తే మీ పట్టణంలో ఉన్న టైల్స్ అమ్మే షాపుల వారికీ , కంస్ట్రక్టక్షన్ చేసే ఇంజనీర్లు, తాపీ మేస్త్రీలతో మనం ఒప్పందం చేసుకుని వారికీ కొంచెం కమీషన్ ఇవ్వడం ద్వారా మనం ఈ పార్కింగ్ టైల్స్ ని ఎక్కువగా సెల్ చేసుకోవచ్చు, 

ఇక ఈ బిజినెస్ లో లాభాల విషయానికి వస్తే ఒక స్క్వేర్ ఫీట్ టైల్స్ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి మనకు 15 రూపాయలు అవుతుంది, ఇది హోల్ సెల్ గా అయితే 25 రూపాయలు, రెటైల్ గా అయితే 35 రూపాయల వరకు ఉంటుంది, సో మనం హోల్ సెల్ గా అమ్ముకున్న ఒక స్క్వెర్ ఫీట్ ప్రొడక్షన్ మీద 10 రూపాయల ప్రాఫిట్ ఉంటుంది ఇలా ఒక రోజుకు మనం కనీసం 1000 స్క్వెర్ ఫీట్ ప్రొడక్షన్ మరియు సెల్ మీద మనకు 10000 రూపాయల లాభం ఉంటుంది ఇందులో మీ లేబర్ ఖర్చు, కరెంట్ బిల్, రా మెటీరియల్, రూమ్ రెంట్ అన్ని పోను మీకు ఒక రోజుకు కనీసం 5 వేలరూపాయల లాభం ఉంటుంది ఈ బిజినెస్ లో ఒకసారి క్లిక్ అయితే మల్లి వెన్కక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేదు 

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!