సాధారణంగా అన్ని రకాల వాహనాలకు ఉండే చక్రాలు సమానంగా ఒకే విధంగా ఉంటాయి. అయితే ట్రాక్టర్ చక్రాలు మాత్రం కొంత భిన్నంగా ఉంటాయి.
సహజంగా ట్రాక్టర్లను వ్యవసాయంకు సంబంధించిన పనులను చేసుకోవడానికి మరియు ఇతర ప్రాంతాలకు రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఎక్కువ పల్లెటూరులలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. అయితే వ్యవసాయంకు సంబంధించిన పనులు పొలాల్లో చేస్తారు మరియు మట్టి, బురద ఉన్న ప్రదేశాలలో వాహనాలను ఉపయోగించినప్పుడు ట్రాక్టర్ చక్రాలకు గ్రిప్ ఎంతో అవసరం.
అన్ని రకాల వాహనాలకు ఉన్నట్టు, ట్రాక్టర్ల చక్రాలు సమానంగా ఉంటే ట్రాక్టర్ బ్యాలెన్స్ తప్పిపోతుంది. కొన్ని సార్లు కార్లు వంటి వాహనాలు ఎక్కువ బురద ఉండడం వల్ల చక్రాలు మట్టిలో ఇరుక్కుంటాయి. అన్ని చక్రాలు సమానంగా ఉండడం వల్ల గ్రిప్ ఉండదు. దాంతో వాహనం కదలదు. అందువలన ట్రాక్టర్ చక్రాలు కొంత భిన్నంగా ఉంటాయి.
దాంతో ట్రాక్టర్ చక్రాలు స్లిప్ అవ్వకుండా పనిచేస్తాయి. ట్రాక్టర్స్ ఎక్కువ లోడ్ ను రవాణా చేస్తాయి. ఒకవేళ ట్రాక్టర్ ముందు చక్రాలు కూడా పెద్దవిగా ఉంటే ఎక్కువ లోడ్ తో టర్నింగ్ తిప్పడానికి చాలా కష్టమవుతుంది. ముందు భాగంలో చిన్న చక్రాలు ఉండడం వల్ల తక్కువ రేడియస్ లో టర్నింగ్ సులువుగా తిప్పవచు
Leave a Comment