ప్రతి ఇంట్లో బట్టల సబ్బులు, పౌడర్ల వాడకం నిత్యం ఉంటుంది. ఇలా రోజువారీ వాడకం వల్ల వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందువలన వీటి తయారీని మనం ఆదాయ వనరుగా మాలచుకుంటే చక్కటి స్వయం ఉపాధిని పొందవచ్చు. అయితే ఈ రోజు మనం “డిటర్జెంట్ పౌడర్” మేకింగ్ బిజినెస్ తయారీ ద్వారా స్వయం ఉపాధిని ఏవిధంగా పొందవచ్చో చూద్దాం.
అందరూ వాషింగ్ మెషిన్లు ఎక్కువగా వాడుతుండడంతో బట్టల సబ్బుల కంటే బట్టల పౌడర్ల వాడకం రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. అందువల్ల డిటర్జెంట్ పౌడర్ బిజినెస్ చేయడం అనేది ఎంతో ఉత్తమం. అయితే ఇప్పటికే మార్కెట్లో మనకి ఎన్నో రకాల డిటర్జెంట్ పౌడర్లు దొరుకుతున్నాయి కదా అని మనం అనుకోవచ్చు. కానీ మనం మన ప్రొడక్ట్ ను తక్కువ ధరకు అందించగలిగితే ఈ బిజినెస్ లో నిలదొక్కుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఈ బిజినెస్ కి కొంచెం ఎక్కువ పెట్టుబడి అవుతుంది అంతేకాకుండా మార్కెటింగ్ కూడా బాగా ఉండాలి.