యువత ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి బాటపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా వినూత్న ఆలోచనలతో యువతరం డబ్బు సంపాదించేందుకు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు.
ప్రస్తుతం మాంసాహార ప్రియులను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తుల లాభాలు తెచ్చి పెట్టే వ్యాపారం ఏదైనా ఉందంటే అది చికెన్ సెంటర్ వ్యాపారం అనే చెప్పాలి. నిజానికి మాంసాహారంలో అత్యంత పౌష్టిక విలువలు కలిగి ఉండి, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న మాంసాహారం చికెన్ అనే చెప్పాలి. మాంసాహారంలో మటన్, పిష్, కన్నా చికెన్ ధర చాలా తక్కువ, మటన్ కేజీ ధర 700 నుంచి 800 వరకూ పలుకుతుంటే…చికెన్ మాత్రం కేజీ ధర..సుమారు రూ.150 వరకూ ఉంటుంది. సీజన్ ను బట్టి హెచ్చుతగ్గులు ఉంటుంటాయి. కొత్తగా ఎన్ని చికెన్ సెంటర్లు వెలిసినా…జనం మాత్రం తమ ఆహారంలో చికెన్ వినియోగం తగ్గించడం లేదు. దీన్నే అద్భుత వ్యాపార అవకాశంగా మలుచుకోవచ్చు.
Leave a Comment