ఈ మధ్య కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతి ఒక్కరూ టీషర్టులు వేసుకోవడం సర్వ సాధారణమైంది. సాధారణ టీ షర్ట్లులు కాకుండా వాటి మీద వివిధ డిజైన్ లతో ఉంటె యువత ఇంకా చాల బాగా ఇష్టపడుతారు. అందువల్ల టీషర్ట్‌లపై ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ వేయడం ఒక చిన్నపాటి బిజినెస్ గా మారింది.
ముఖ్యంగా సినిమా ప్రమోషన్ కోసం, ఆడియో రిలీజ్ ఫంక్షన్ కోసం, కార్పొరేట్ ప్రమోషన్స్ కోసం, స్పోర్ట్స్ కోసం, పొలిటికల్ ర్యాలీలు, 5కె, 2కె రన్, గణేష్ ఉత్సవాల ఊరేగింపులు, ఇలాంటి అన్ని కార్యక్రమాల్లో వారి కార్యక్రమాల పెయింటింగ్ ఉన్న టీ షర్ట్స్ ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. అందువల్ల ఈ బిజినెస్ కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ బిజినెస్ ను మీరు అతి తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించవచ్చు.
Leave a Comment