అరటి చెట్టు గురించి మనందరికీ తెలిసిందే. మనం అరటి చెట్టు అంటాం కానీ వాస్తవానికి అది చెట్టు కాదు. మిగతా చెట్ల కాండం మాదిరిగా అరటి చెట్టుకు కాండం ఏర్పడదు. అరటి ఆకులు పొరలుగా ఏర్పడి కాండం ఆకారం సంతరించుకుంటుంది. కాబట్టి కాండాన్ని పొరలు పొరలుగా విడదీసే అవకాశం ఉంటుంది. అయితే పల్లెటూర్లలో అరటిపళ్లను కోసిన తర్వాత అరటి చెట్లను వృధాగా పడేస్తుంటారు. కానీ వాటిని మనం ఉపయోగించుకుంటే చక్కటి స్వయం ఉపాధిని పొందవచ్చు. అరటి చెట్టు కాండం నుంచి నార్లను తీసి వాటితో కప్పులు, ప్లేట్స్, హ్యాండ్ మేడ్ టిష్యూ పేపర్, డెకరేషన్ పేపర్, నర్సరీ పేపర్, పౌచెస్, క్యారీ బ్యాగ్స్, డోర్ మాట్స్, ఇంకా అనేకమైన ప్రొడక్ట్స్ ను తయారు చేయవచ్చు. పూర్తి వివరాలు ఈ వీడియోలోచూడండి .