Current Affairs

శ్రీనాథయుగం (15వ శతాబ్దం) ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ముఖ్యమైన ప్రశ్నలు – సమాధానాలు (తెలుగు జనరల్ నాలెడ్జ్)

శ్రీనాథయుగం (15వ శతాబ్దం)

1. శ్రీనాథుని తాత పేరు ఏమిటి?
Ans :   కమలనాభామాత్యుడు

2. శ్రీనాథుని తల్లిదండ్రులెవరు?
Ans :  తల్లి భీమాంబా, తండ్రి నూరయామాత్యుడు

3. శ్రీనాథుని జన్మస్థలం ఏది?
Ans :   కల్పట్టణం

4. శ్రీనాతుడు ఎవరి ఆస్థానకవి?
Ans :  పెదకోమటి వేమారెడ్డి

5. శ్రీనాథుని జనన కాలమేది?
Ans :  1860

6. శ్రీనాథుడు ఏ రాజు ఆస్థానంలో డిండిమభట్టు, కంచుఢక్కా పగలగొట్టించాడు?
Ans :   ప్రౌఢ దేవరాయలు

7. గౌడ డిండిమభట్టు అసలు పేరేమిటి?
Ans :   అరుణగిరి నాధుడు .

8. శ్రీనాథునికి కనకాభిషేకం ఎవరి ఆస్థానంలో జరిగింది? 
Ans :   ప్రౌఢదేవరాయలు 

9. శ్రీనాథుని తొలి కావ్యమేది?
Ans :  మరుత్తరాట్చరిత్ర 

10. కనకాభిషేకం తెలుగు కవుల్లో ప్రప్రధంగా ఏకవికి జరిగింది?
Ans :  శ్రీనాథునికి 

11. శ్రీనాథుడు నూనూగు మీసాల నూత్నయవ్వనంలో రచించిన గ్రంథమేది? 
Ans :  శాలివాహన సప్తశతి 

12. శ్రీనాథుడు రచించిన పల్నాటి వీరచరిత్ర ఏ ఛందస్సులో ఉంది? 
Ans :   ద్విపద ఛందస్సులో 


13. శ్రీనాథుడు తన హరవిలాసాన్ని ఎవరికి అంకితమిచ్చాడు. 
Ans :  అవచి తిప్పయసెట్టికి 

14. శ్రీనాథుడు నిండు యవ్వనంలో రచించిన ప్రౌఢ ప్రబంధమేది? 
Ans :  శృంగార నైషధం 

15. శ్రీనాథుని శృంగార నైషధానికి ఆధార గ్రంథమేది? 
Ans :  శ్రీహర్షుని నైషధం 

16. శ్రీనాథుడు శృంగార నైషధాన్ని ఎవరికి అంకితమిచ్చాడు?
Ans :   మామిడి సింగనకు 

17. తెలుగులో మొట్టమొదటి వీరగాధా కావ్యమేది? 
Ans :  పల్నాటి వీరచరిత్ర 

18. కాశీఖండం గ్రంథంలో ఎన్ని ఆశ్వాసాలున్నాయి?
Ans :   ఏడు

19. కాశీఖండాన్ని శ్రీనాథుడు ఏ పురాణంలోని కథకి అనువాదంగా రచించాడు? 
Ans :   స్కాంద పురాణం 

20. కాశీఖండం గ్రంథాన్ని శ్రీనాథుడు ఎవరికి అంకితమిచ్చాడు? 
Ans :   రాజమహేంద్రవర ప్రభువైన వీరభద్రా రెడ్డికి 

21. మానవ ప్రకృతి పరిశీలనకు శ్రీనాథుని ఏ గ్రంథం సాక్షిగా ఉంది?
Ans :  కాశీఖండం 

22. నాకవిత్వంబు నిజము కర్ణాటభాష… అని శ్రీనాథుడు ఏ కావ్యంలో వివరించాడు? 
Ans :  భీమఖండం 

23. శృంగార నైషధంలో నలదమయంతుల మధ్య దూత ఎవరు?
Ans :   హంస 

24. శృంగార నైషధ గ్రంథంలో ఎన్ని ఆశ్వాసాలున్నాయి?
Ans :   10 

25. హరుని యొక్క ఐదు విలాసాలకు సంబంధించిన ఐదు కథలు గల గ్రంథమేది? 
Ans :  హర విలాసం 

26. చిరుతొండ నంబికథ – శ్రీనాథుని కావ్యాలలో దేనిలో ఉంది? 
Ans :   హర విలాసం 

27. శ్రీనాథుడు నార్థక్యంలో రచించిన గ్రంథమేది?
Ans :  శివరాత్రి మహాత్మ్యం 

28. సముద్ర మధన వృత్తాంతం – శ్రీనాథుని ఏ కావ్యంలో ఉంది?
Ans :  హర విలాసం 

29. దాక్షారామానికి మరో పేరు ఏమిటి?
Ans :  దక్షిణ కాశీ 

30. శివుని దారు కావన విహార ఘట్టం శ్రీనాథుని ఏ కావ్యంలో ఉంది? 
Ans :  హర విలాసం 

31. వింధ్య పర్వత విజృంభణం – అనే ఘట్టం శ్రీనాథుని ఏ కావ్యంలో ఉంది? 
Ans :   కాశీఖండం 

32. క్రీడాభిరామం ఏ రాజుల సాంఘిక జీవితానికి దర్పణం పడుతుంది? 
Ans :  కాకతీయులు 

33. తెలుగులో వెలసిన మొట్టమొదటి హేళన కావ్యం ఏది?
Ans :   క్రీడాభిరామం 

34. దాక్షారామ భీమేశ్వరుని లీలలు వర్ణించే శ్రీనాథుని రచన ఏది? 
Ans :   భీమేశ్వర పురాణం 

35. శ్రీనాథుని భీమఖండం ఎన్ని ఆశ్వాసాల ప్రబంధం? 
Ans :  ఆరు 

36. పల్నాటివీరచరిత్రను శ్రీనాథుడు ఎవరికి అంకితమిచ్చాడు. 
Ans :  చెన్నకేశవ స్వామికి 

37. శివరాత్రి మహాత్మ్యం గ్రంథంలో కథానాయకుడు ఎవరు?
Ans :  సుకుమారుడనే బ్రాహ్మణ యువకుడు 

38. క్రీడాభిరామం కావ్యానికి మూలమేది?
Ans :  రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృతంలో రచించిన ప్రేమాభిరామం 

40. తెలుగులో మొట్టమొదటి వీరగాథా కావ్యమేది? 
Ans :  పల్నాటి వీర చరిత్ర

41. శ్రీనాథుడు ప్రజాకవిగా పేరు పొందటానికి కారణమైన గ్రంథమేది? 
Ans :  పల్నాటి వీర చరిత్ర 

42. శ్రీనాథుని పల్నాటి వీర చరిత్రకు మరో పేరేమిటి?
Ans :   పల్నాటి భారతం 

43. శ్రీనాథుని క్రీడాభిరామం ఏ ప్రక్రియకు సంబంధించింది? 
Ans :  వీధి నాటకం 

44. శ్రీనాథుడు తెనిగించిన ప్రాకృత కావ్యమేది? 
Ans :  గాధాసప్తశతి 

45. శ్రీనాథునికి గల బిరుదేది?
Ans :   కవి సార్వభౌముడు 

46. సకల సద్గుణ నికురంజ శారదాంబు అని ప్రస్తుతించిన కవి ఎవరు? 
Ans :   శ్రీనాథుడు 

47. ఈశ్వరార్చన కళాశీలుడు – అని ప్రతీతి?
Ans :  శ్రీనాథుడు 

48. శివరాత్రి మహాత్మ్యం గ్రంథం శ్రీనాథుడు ఎవరికి అంకిత మిచ్చాడు?
Ans :   ముమ్మడి శాంతయ్య 

49. శ్రీనాథుడుకి సమకాలీకుడైన ప్రసిద్ధ తెలుగు కవి ఎవరు?
Ans :  పోతన 

50. బొంగరాల ఆటను వర్ణించిన శ్రీనాథుని కావ్యమేది? 
Ans :  పల్నాటి వీర చరిత్ర 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now
పోతన 


51. పోతన ఏ శతాబ్దానికి చెందిన కవి?
Ans :  15వ శతాబ్దం 

52. పోతన స్వస్థలం ఏది?
Ans :   వరంగల్ జిల్లా బమ్మెర గ్రామం

53. భోగినీదండకం రచించినది ఎవరు?
Ans :   పోతన 

54. పోతన బిరుదు ఏది?
Ans :  సహజ పాండిత్యుడు, భక్తకవి 

55. భాగవతాన్ని పోతన ఎవరికి  అంకితమిచ్చాడు?
Ans :  శ్రీరామచంద్రునికి 

56. పోతన తల్లి దండ్రులెవరు?
Ans :  కేసయ, లక్కమాంబలు 

57. భాగవతం అంటే…
Ans :  భగవత్ సంబంధమైనది 

58. వీరభద్ర విజయం రచించినదెవరు?
Ans :  పోతన 

59. పోతన గురువు ఎవరు?
Ans :  ఇవటూరి సోమనారాధ్యుడు

60. నారాయణ శతకం రచించినది ఎవరు?
Ans :   పోతన 

61. భోగినీ దండకంలోని ఇతివృత్తం ఏది?
Ans :  భోగినీ సింగ భూపాలుర ప్రణయం 

62. తెలుగులో వెలువడిన తొలి స్వతంత్ర దండకమేది? 
Ans :  భోగినీ దండకం

63. భాగవతం ఎన్ని స్కంధాల గ్రంథం? 
Ans :  . 12 స్కంధాల గ్రంథం 

64. కమలాక్షు నర్చించు కరములు కరములు… శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ.. అనే సుప్రసిద్ధములైన పద్యపాదాలు ఏ గ్రంథంలోనివి? 
Ans :  భాగవతంలోనివి 

65. ప్రహ్లాద చరిత్ర – భాగవతంలో ఏ స్కంధంలో ఉంది? 
Ans :   సప్తమ స్కంధం 

66. పోతన రచించిన ప్రసిద్ధ ఉపాఖ్యానం?
Ans :   రుక్మిణీ కళ్యాణం

67. పలికెడిది భాగవతంబట – పలికించెడివాడు రామభద్రుండట… అన్నకవి ఎవరు?
Ans :   పోతన

68. పోతన ప్రధాన రచన ఏది?
Ans :   ఆంధ్ర మహాభాగవతం

69. నేను అందరి మెప్పింతు -అన్న కవి?
Ans :  పోతన

70. పోతన భాగవతంలో ఎన్ని పద్యగద్యాలున్నాయి? 
Ans :   32 వేలు 

71. పోతన భాగవతమును అనువదించడంలో ఏ పద్ధతిని అనుసరించాడు? 
Ans :  స్వతంత్రానువాద పద్దతి 

72. శిధిలమైన భాగవత స్కంధములను పోతన శిష్యులు ఎవరు పూరించారు?
Ans :   నారయ, సింగన, గంగనలు 

73. భాగవతంలో ఒక భక్తిరస కావ్యంగా ఏ ఘట్టాన్ని చెప్పవచ్చు?
Ans :  ప్రహ్లాద చరిత్ర 

74. పోతన భాగవతమున ఏ స్కంధమునకు ప్రత్యేకత ఉంది? 
Ans :  దశమ స్కంధం 

75. విశ్వనాథ పోతనకవిని ఏమని కీర్తించాడు?
Ans :   తెలుగుల పుణ్యపేటి పోతన 

76. పోతన పద్యాల్లో ఏ అలంకారం ఎక్కువగా కనిపిస్తుంది? 
Ans :  అంత్యానుప్రాస 

77. పోతన కవిత్వంలో ప్రధానమైన లక్షణమేది?
Ans :  శబ్దాలంకార మాధ్యుర్యం 

78. తెలుగు సాహిత్యంలో అత్యంత జనప్రియమైన సహజకవి ఎవరు?
Ans :  పోతన 

79. తెలుగు వాజ్మయ ప్రపంచంలో పోతన ను చిరంజీవిని చేసిన మహా గ్రంథమేది.
Ans :  ఆంధ్ర మహాభాగవతం 

80. ఆత్మనివేదన భక్తి ఎందులో ఉంది?
Ans :  గజేంద్రమోక్షం పిల్లల మర్రి పినవీరభద్రుడు 

81. శ్రీనాథ యుగంలో సరస్వతీ కటాక్షాన్ని పొందిన కవి ఎవరు? 
Ans :   పిల్లల మర్రి పినవీరభద్రుడు 

82. వాని నా రాణి-అని పలికిన కవి ఎవరు
Ans :   పిల్లల మర్రి పినవీరభద్రుడు 

83. పినవీరభద్రుడు తల్లిదండ్రులెవరు?
Ans :   తల్లి నాగమాంబ, తండ్రి గాదయామాత్యుడు 

84. పిల్లలమర్రి పినవీరభద్రుడు గురువు ఎవరు? 
Ans :  భారతీ తీర్థ యతీంద్రులు 

85. శృంగార శాకుంతలం – శృంగార రసప్రబంధాన్ని రచించినది ఎవరు? 
Ans :   పిల్లలమర్రి పినవీరభద్రుడు 

86. పిల్లలమర్రి పినవీరభద్రుడు రచించిన వీర కావ్యమేది?
Ans :  . జైమినీ భారతం 

87. శ్రీనాథుని వలె సమకాలిక కవుల మెప్పును పొందిన గొప్పకవి ఎవరు? 
Ans :   పిల్లలమర్రి పినవీరభద్రుడు 

88. శృంగార శాకుంతలం ఎన్ని ఆశ్వాసాల ప్రబంధం? 
Ans :   నాలుగు 

89. శృంగార శాకుంతలాన్ని పిల్లలమర్రి పిన వీరభద్రుడు ఎవరికి అంకితమిచ్చాడు? 
Ans :  వెన్నయా మాత్యునికి 

90. శృంగార శాకుంతలానికి మరో పేరేమిటి?
Ans :  శాకుంతలా పరిణయం

91. పిల్లలమర్రి పినవీరభద్ర కవిపై ఏ కవి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది?
Ans :  శ్రీనాథ మహాకవి

92. పినవీరభద్రుడు ఏ అలంకారాలను తన కవిత్వంలో హృదయానందంగా ప్రయోగించాడు? 
Ans :  ఉపమా, రూపకం, ఉత్ర్పేక్ష 

93. జైమినీ భారతం ఎన్ని ఆశ్వాసాల ప్రౌఢ కావ్యం? 
Ans :  ఎనిమిది 

94. జైమినీభారతం కావ్యం ఎవరికి అంకితమివ్వబడింది.
Ans :  సాళ్వ నరసింహ భూపాలునకుత 

95. జైమినీభారతం కావ్యం దేనికి ఆంధీకరణమని చెప్పవచ్చు?
Ans :   ఆశ్వమేధ పర్యానికి 

96. సీసపద్యాన్ని నదడిపంచడంలో శ్రీనాథున్నితలపించిన కవి ఎవరు? 
Ans :   పిల్లలమర్రి పినవీరభద్రుడు 

97. జైమినీభారతంలో చెప్పబడిన కథలెన్ని?
Ans :  ఏడు 

98. జైమినీభారతంలో ఏ అలంకారాన్నివిశేషంగా కవాడాడు? 
Ans :   ఉపమాలంకారం

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!