దుర్గామాత యొక్క నాల్గవ అవతారము “కుశ్మాండ దేవి” . దరహాసము చేయుచు బ్రహ్మానందమును సృజించునది గావున ఈ దేవిని కుశ్మాండ దేవి అను పేరుతొ విఖ్యాతమయ్యెను. ఈమెయు సింహవాహినీయే. సంస్కృతము నందు కుశ్మాండ అనగా గుమ్మడి కాయ. కుశ్మాండ బలి ఈమెకు అత్యంత ప్రీతికరము. అందువలననే ఈమెను కుశ్మాండ దేవి అని పిలుస్తారు. నవరాత్రి ఉత్సవములలో నాల్గవ రోలున్నా కుశ్మాండ దేవి స్వరూపముననే దుర్గామాత భక్తుల పూజలను అందుకొనును. ఈనాడు సాధకుని మనస్సు అనాహత చక్రము నందు స్థిరమగును. కావున ఈ దినమున సాధకుడు మిక్కిలి పవిత్రమైన నిశ్చలమైన మనస్సుతో కుశ్మాండ దేవి స్వరూపమునే ధ్యానించుచు పూజలు సలుపవలెను. కొద్దిపాటి భక్తి సేవకులకు ఈ దేవి ప్రసన్నురాలగును . మానవుడు నిర్మల హృదయముతో ఈమెను శరణుజొచ్చినచో అతనికి అతి సులభముగా పరమపదము ప్రాప్తించును.
- శ్రీ విజయ దుర్గా దేవి ఆలయానికి ప్రక్కనే ఉన్న గొప్ప మండపంలో ఈ రోజు అమ్మవారు కుశ్మాండ దేవిగా అలంకరింపబడి దర్శనం ఇస్తుంది.
05-10-2016 బుధవారము (శుద్ధ చవితి ) రోజు కడప కనకదుర్గాదేవి ఆలయం లో జరుగు కార్యక్రమాలు :
- తెల్లవారుజాము 4. 30 నిమిషాలకు : సప్త వింశతి (27 ) కలశములతో విశేష అభిషేకము
- సాయంత్రం 3. 30 : సహస్ర కాలువ పూజ
- రాత్రి 6. 00 : “కుశ్మాండ దేవి ” అలంకారము
- రాత్రి 8. 00 : ఆలయ ప్రదక్షిణ
Leave a Comment