Current Affairs

Kadapa Sri Vijaya Durga Devi Temple Programs – Kanaka Durga Devi Alankaaram at 01-10-2016 (Saturday)

01-10-2016 శనివారం (శుద్ధ పాడ్యమి)

కనకదుర్గాదేవి అలంకారము 


నవరాత్రి ఉత్సవాలలో దుర్గాపూజ ప్రశస్తమైనది . “దుర్గముడు” అనే రాక్షసుణ్ణి సంహరించడం వలన  దేవిని “దుర్గ” అని అంటారు. ఆమె మహాశక్తి యుక్త అయిన దేవత. యస్యా:  పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తితా …  ఆ దేవిని మించినదేది లేదు. కాబట్టి ఆమెను “దుర్గ” అన్నారు. ” ఓం దుర్గే రక్షిణి స్వాహా” అనే నవాక్షర మంత్రంతో దుర్గాపూజను నిర్వహిస్తారు. సనాతన ధర్మంలో శక్తి ఉపాసనకు మిక్కిలి ప్రాధాన్యముంది. శివుడు శక్తితో కుడి ఉన్నప్పుడే ఏమైనా చేయగలడని , లేకుంటే ఏమీ చేయజాలడని , త్రిమూర్తులు సైతం శక్తిని ఆరాధిస్తారని, “సౌందర్య లహరి”లోని మొట్టమొదటి శ్లోకంలో శంకర భవత్పాదులు చెప్పారు. ఈ ఉత్సవాలలో కలశ స్థాపనాది కార్యక్రమాలు ఆగమోక్త పద్దతిలో నిర్వహించి , శక్తిని పూజించడం ఉత్తమ పక్షం. అది వీలు కానప్పుడు దేవి పటాన్ని గాని, పుస్తకాలను గాని పూజిస్తూ స్తోత్రనామాదులు పఠించవచ్చు .






త్రిశక్తి స్వరూపిణి స్తుతి 
యా దేవీ సర్వ భూతేషు శక్తిరూపేణా సంస్థితాః 
నమస్త స్తై నమస్త స్తై నమస్త స్తై నమో నమః 


01-10-2016 శనివారం (శుద్ధ పాడ్యమి) రోజు కడప కనకదుర్గాదేవి ఆలయం లో జరుగు కార్యక్రమాలు :


Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now
  • తెల్లవారుజాము 4. 30 నిమిషాలకు  :  నవకలశస్నాపనము (9) కలశములతో విశేష అభిషేకము 
  • సాయంత్రం 4. 30                          : నిమిషాలకు అష్టదళ పద్మారాధన 
  • సాయంత్రం 6. 00                          :   గంటలకు శ్రీ కనకదుర్గాదేవి అలంకారము 
  • రాత్రి 8. 00                                   : గంటలకు ఆలయ ప్రదక్షిణ   

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!