కడప నగరం లోని శ్రీ విజయ దుర్గా దేవి ఆలయంలో పౌర్ణమి సందర్భముగా శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం తొమ్మిది మంది దంపతులతో ఆలయ వ్యవస్థాపకులు శ్రీ దుర్గా మల్లికార్జున రావు మరియు నిర్వాహకులు శ్రీ దుర్గా ప్రసాద్ లు తొమ్మిది కళాశాలతో ఆలయ ప్రదక్షిణాలు చేసి నవ కలశ స్నాపనం నిర్వహించారు.
యాగశాలలో చండి హోమం నిర్వహించి ఆలయ మండపంలో కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఫణి భూషణ శర్మ ఆధ్వర్యంలో సాయంత్రం 108 మంది ముత్తయిదువలతొ దీపాలను వెలిగించారు. ఈ అష్టోత్తర శత దీపాలన్కార సేవ అనంతరం అమ్మవారి ఉత్శవ మూర్తికి పల్లకి సేవ నిర్వహించారు .
You also read : Kadapa Sri Vijaya Durga Devi Temple History – Temples in Kadapa
Leave a Comment