హాయ్ ఫ్రెండ్స్ పూర్వం మన పెద్దలు 80 ఏళ్ల వయసు వచ్చిన కర్ర లేకుండానే నడిచేవారు. ఎవరి పనులు వారే చేసుకునేవారు, ఎందుకంటే వారి ఆహారపు అలవాట్లు కావచ్చు ఆనాటి కూరగాయలు లేదా వంటనూనెలు కావచ్చు అన్ని ఆర్గానిక్ అంటే సహజ సిద్ధంగా తయారైన వాటిని ,తినేవారు, కానీ ప్రస్తుతం ఏవస్తువు చూసినా అన్ని రసాయన ఎరువులు వాడి పండించేవే, అందుకే ఈ రోజుల్లో 40 ఏళ్లకే చాలా రకాల జబ్బుల బారిన పడుతున్నారు, కానీ ప్రస్తుతం చాల మంది తమ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా నిత్యం వాడే వంట నూనెల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగానే రీఫైన్డ్ ఆయిల్స్ కాకుండా గానుగలో ఆడించిన సహజసిద్ధమైన నూనెలను వాడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.
వీటి ధర ఇతర వంట నూనెలతో పోలిస్తే కాస్త ఎక్కువే. అయినప్పటికీ ఆరోగ్యంగా ఉండేందుకు జనాలు గానుగలో ఆడించిన వంట నూనెలను వాడేందుకే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఇదే గానుగ నూనె తయారు చేసి అమ్మే బిజినెస్ మనం ప్రారంభించడం ద్వారా . చక్కని ఆదాయం సంపాదించవచ్చు. మరి.. ఈ గానుగ నూనె వ్యాపారాన్ని ఎలా మొదలు పెట్టాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, లాభాలు ఎలా ఉంటాయి అనే విషయాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం .