Private Jobs

వేంకటేశ్వర కాలేజీలో ఆర్మీ రిక్రూట్​మెంట్​ ర్యాలీ

అగ్ని వీర్ స్కీమ్ లో భాగంగా ఈ నెల 15 నుంచి 31వరకు తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర కాలేజీలో ఆర్మీ రిక్రూట్​మెంట్​ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులకు ఫిట్ నెస్, మెడికల్, రన్నింగ్ టెస్ట్ నిర్వహించేందుకు ఆఫీసర్లు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 60 వేల మంది యువత పాల్గొంటారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. రోజుకు 5 వేల మంది అభ్యర్థులకు టెస్టులు నిర్వహించనున్నారు. అగ్ని వీర్ జనరల్ డ్యూటీ, అగ్ని వీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్, టెక్నికల్, అగ్ని వీర్ ట్రేడ్స్ మెన్, టెన్త్ పాస్, ఎనిమిది పాస్ కేటగిరీ లో నియామకాలు చేపట్టనున్నారు. 


Leave a Comment

error: Content is protected !!