సహజంగా మనం వాటర్ బాటిల్ కొనాలన్నా ఏమైనా కూల్ డ్రింక్స్ వంటివి తాగాలన్న అవి వేరే వేరే బ్రాండ్స్ లో ఎక్కువ ధరకు లభ్యమవుతాయి. అయితే గ్రేప్స్, ఆరెంజ్, లెమన్ రస్నా వంటి సోడా హబ్ డ్రింక్స్ గాని వాటర్ గాని రెడీమేడ్ గా ప్యాక్ చేసి తక్కువ ధరకే సేల్ చేసినట్లయితే మనం చక్కటి లాభాలను పొందవచ్చు.
వీటన్నింటినీ ప్యాక్ చేసి సేల్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది అదే కప్ సీలింగ్. అంటే మనకి మార్కెట్ లో టాటా గ్లూకోస్ కప్స్ అందుబాటులో ఉంటాయ్ కదా అదే తరహాలో ఈ బిజినెస్ కూడా ఉంటుంది. ఇలా రకరకాల డ్రింక్స్ ను కప్ సీలింగ్ మిషన్ ద్వారా సీల్ చేసి ప్యాక్ చేస్తే మనం చక్కటి స్వయం ఉపాధిని పొందవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీనిని ఆడవారు సైతం ప్రారంభించవచ్చు. ఈ బిజినెస్ కు సంబంధించిన అన్ని వివరాలను ఈ క్రింద ఉన్న వీడియో ద్వారా తెలుసుకుందాం.