లాక్ డౌన్ తర్వాత ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అందిస్తోంది. బ్యాంక్ నుంచి ఏకంగా రూ.10 లక్షలు లోన్ అందిస్తోంది దీని పేరు మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) ఈ పథకాన్ని అందిస్తోంది. ఆ వివరాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం
మహిళలు సొంత వ్యాపారాల ద్వారా సాధికారత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను అందిస్తోంది. మహిళా ఉద్యమ్ నిధి పేరుతో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నిర్వహించే మహిళలకు రూ.10 లక్షల వరకు ఆర్థిక సహకారం అందించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ డబ్బుతో మహిళలు వ్యాపారాలు చేయొచ్చు. ఇందులో భాగంగా బ్యాంకులు అర్హులైన మహిళలకు ఆకర్షణీయ వడ్డీ రేటుకే రుణాలు అందిస్తున్నాయి.