Meeku Telusa

భారత దేశాన్ని పట్టిపీడిస్తున్న మూఢ నమ్మకాలు


1).ఈ విశ్వాన్నంతటినీ దేవుడు సృష్టించి ఒక పద్ధతి ప్రకారం నడుపుతున్నాడు 

2).ఇతర జీవ జాతులకు భిన్నమైన లక్ష్యంతో ఈ మానవజాతి సృష్టి చేయబడినది 

3).మనం చేసే పాప పుణ్యాలనుబట్టి స్వర్గనరకాలు  నిర్ణయించబడతాయి 

4).భజనలు నైవేద్యాలు పూజలు మొక్కబళ్ళ ద్వారా దేవుని ప్రసన్నం చేసుకోవచ్చు 

5).గ్రహాలు మానవ జీవితాలను నిర్దేశితం చేస్తాయి

6).గ్రహాలు అనుకూలించకపోతే శాంతి పూజల ద్వారా గ్రహగతులను మార్చవచ్చు 

7).భూమికి దిక్కులు ఉన్నాయి వాటిని భుాదిక్పాలకులు పాలిస్తున్నారు

8).యజ్ఞాల ద్వారా వర్షాలు కురిపించవచ్చు మరియు ప్రపంచంలో శాంతిని నెలకొల్పవచ్చు

9).వ్రతాలు నోముల ఆచరణతో స్త్రీల సౌభాగ్యం వర్ధిల్లుతుంది 

10).మరణాంతరం ఆత్మ మరో జీవి లోకి ప్రవేశిస్తుంది 

11).ఈ జన్మలో చేసినటువంటి కార్యాలను బట్టి పునర్జన్మ లో  ఉచ్చ నీచ జన్మలు ఉంటాయి 

12).రాహు కేతు గ్రహాలు ఉంటాయి వాటి ద్వారానే గ్రహణాలు ఏర్పడుతున్నాయి 

13).పెళ్లికి ముందు వధూవరుల జాతకాలు పరిశీలించాలి 

14).అర చేతిలో రేఖలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి

15). దుర్ముహూర్తంలో ప్రారంభించిన పనులు సఫలం కావు

16). కోరికలు తీరకుండా మరణించినవారు దయ్యాలై తిరుగుతారు 

17).ఇంటిలో మరణం సంభవిస్తే ఆ ఇంటిని కొద్దికాలం వదిలివేయాలి 

18).గుళ్ళూ గోపురాల చుట్టూ తిరిగితుా పూజలు పునస్కారాలు చేస్తే పిల్లలు పుడతారు 

19).రంగు రాళ్ళ ఉంగరాలు మన జాతకం లో మార్పు తేస్తాయి

20).వ్యక్తుల భవిష్యత్తుని కాక రాష్ట్ర దేశ భవిష్యత్తును కూడా జ్యోతిష్యం చెప్పగలదు

21).గర్భంతో ఉండగా కుంకుమ పువ్వు తింటే పుట్టే పిల్లలు ఎర్రగా పుడతారు 


22).పచ్చి బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుంది 

23).పాము తేలు కాటులో విషం మంత్రం ద్వారా తొలగించవచ్చు 

24).బాణామతి లేదా చేతబడితో మనుషులను జంతువులను చంపవచ్చు 

25).దెయ్యం పట్టిన లేదా చేతబడి చేసిన వాటిని భూతవైద్యులు నయం చేయగలరు 

26).క్షుద్ర విద్యలు ద్వారా కొన్ని అతీతశక్తులను స్వాధీనం చేసుకోవచ్చు 

27).పని మీద వెళ్తుంటే ఎవరైనా తుమ్ముతే వెంటనే ఆగి కాళ్ళు కడుక్కుని బయలుదేరాలి 

28).పెళ్లి ,వ్యాపారం , గృహప్రవేశం ఇలాంటి వాటికి పురోహితుడు అవసరం 

29).జ్యోతిష్యం చెప్పేవారు భూత వర్తమాన భవిష్యత్తు కార్యాలను చెప్పగలరు 

30).వాస్తులు పాటించి నిర్మాణాలు నిర్మించడం వల్ల ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి

31).గ్రామదేవతలను జాతరలు జంతుబలుల ద్వారా వారిని శాంతపరచవచ్చు

32).పిండప్రదానాలు చేస్తే మరణించిన పూర్వీకులకు అవి చేరుతాయి 

33).పేరు లో కొన్ని అక్షరాలను మార్చడం ద్వారా మన జీవితాలను మార్చుకోవచ్చు 

34).దేవుళ్ళు దయ్యాలు ఆవహించినప్పుడు ఆవహించిన వారికి  పూనకం వస్తుంది 

35).తాయెత్తులు ధరిస్తే కొన్ని దుష్ట శక్తుల ద్వారా  రక్షణ పొందవచ్చు 

36).శరీరం మీద ఉండే పుట్టుమచ్చలు మంచిచెడులను నిర్దేశిస్తాయి 

37).స్త్రీలలో చెడురక్తం బహిష్టు ద్వారా బయటికి వెళ్తుంది 

38).బహిష్టు సమయంలో స్త్రీలు వంటగదిలోకి రాకూడదు 

39).దుశ్శకునాలు వినిపించకుండా ఉండడం కోసం శుభకార్యాలలో భజంత్రీలు అవసరం 

40).నూతన దంపతులకు పగటిపూట అరుంధతి నక్షత్రం చూపాలి

About the author

Mallikarjuna

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!