మనదేశంలో నిర్మాణ రంగంలో బిల్డింగ్స్ నిర్మాణానికి కావలసిన మెటీరియల్ కు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, . అందువలన బిల్డింగ్స్ నిర్మాణానికి కావాల్సిన సిమెంట్, పెయింట్స్, టైల్స్, పీఓపి షీట్స్ వంటి వాటికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. అందులోనూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షీట్స్ అంటే పీఓపీ షీట్స్ కి డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంది.
వీటిని ఇళ్ళల్లో, హోటళ్ళలో, ఆఫీసులలో, బిల్డింగ్స్ లో, షాపింగ్ కాంప్లెక్సులలో ఇంటీరియర్ ను అందంగా డెకరేట్ చేయడానికి, సీలింగ్స్ కి వాడుతుంటారు. అందువలన ఈ పీఓపీ షీట్స్ తయారీ బిజినెస్ ని కనుక మనం ప్రారంభిస్తే మనం స్వయం ఉపాధి పొందడమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పించవచ్చు.